సినీహీరోలకూ రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఇది మరీ ఎక్కువ. ఎన్టీఆర్ స్ఫూర్తితో ఎందరో నటులు రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత కూడా అదే పరంపర కొనసాగుతోంది. సినిమాల్లోనుంచి కాస్త ఫేడవుట్ అవుతున్నామనగానే ఏదో ఒక పార్టీ వైపు చూడటం ఇప్పుడు నటులకు అలవాటుగా మారింది. ఆ తర్వాత ఎమ్మెల్యే, ఎంపీ ఏదో ఒక పదవికి పోటీ చేయడమూ కామనైపోయింది.  ఇప్పుడు హీరో శివాజీ అదే పనిలో ఉన్నాడు. సినిమాల్లో ఛాన్సులు బాగా తగ్గిపోయాక.. ఇప్పుడు సామాజిక అంశాలపై బాగా స్పందిస్తున్నాడు. ఆ మధ్య వోల్వో బస్సు దహనం సమయంలోనూ ఆ తర్వాత ఒకటి రెండు ఘటనల్లో సామాజికంగా స్పందించాడు. ఇప్పుడు మోడీ స్వచ్ఛభారత్ కు బాగా ప్రచారం చేస్తున్నాడు. శనివారం గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన స్వచ్ఛచిలకలూరిపేట కార్యక్రమానికి శివాజీ హాజరయ్యాడు.  మరుగుదొడ్ల అవసరం.. అనారోగ్యానికి బహిరంగ మల విసర్జన ఎలా కారణమవుతుందనే విషయాలపై బాగానే స్పీచ్ దంచాడు. బాగా ఫీలయ్యాడేమో ఆవేశంగా మాట్లాడాడు. అసలు బయట మల, మూత్ర విసర్జన చేసేవాళ్లను జైల్లో పెట్టేలా చట్టాలు చేయాలన్నాడు. అదే వేదికపై మంత్రులు కూడా ఉండేసరికి.. పనిలో పనిగా చంద్రబాబుపైనా ప్రశంసలు కురిపించాడు.  చంద్రబాబు తలచుకుంటే స్పేస్ ను కూడా నేలకు దింపుతాడన్నారు. ఆయన ఒక్కడుంటే చాలు స్టేట్ పరుగులు పెడుతుందని ధీమాగా చెప్పాడు. మరి ఈ డైలాగులు మనసులోంచి వచ్చినవేనా.. లేదా ఏదో ఒక పదవి కోసం స్కెచ్ వేసి స్క్రిప్టు ప్రకారం రాసుకున్నవా.. అని వేదికపై ఉన్నవాళ్లు ఆలోచనలో పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: