అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇండియాకు వస్తే ఆయనను విశాఖకు తీసుకురావాలని భావించారు ఏపీ ప్రభుత్వం వారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా తన ప్రయత్నాలను తాను చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఒబామా తమ రాష్ట్రంలో పర్యటిస్తే అది తమ వ్యక్తిగత ఇమేజ్ కు చాలా ఉపయుక్తంగా ఉంటుందనేది ఈ ప్రభుత్వాల అధినేతల లేక్క.

అయితే ఒబామా కొన్ని గంటల సేపు మాత్రమే ఇండియాలో ఉండటం.. రిపబ్లిక్ డే ఉత్సావాల్లో పాల్గొని తన దారిన తాను వెళ్లిపోతుండటంతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు తీవ్రమైన నిరాశే కలిగింది. అయితే అక్కడికీ చంద్రబాబు నాయుడు ఎలాగైనా ఒబామాతో మీట్ కావడానికి ప్రయత్నించాడని తెలుస్తోంది.

ఢిల్లీలో రాష్ట్ర పతిభవన్ లో ఒబామాకు ఇచ్చే విందుకు హాజరైతే ఒబామాను కలిసే అవకాశం దక్కుతుంది. అందుకోసం కేంద్రం నుంచి ఏమైనా ఆహ్వానం అందుతుందా? అని కూడా బాబు గారు ఒక లుక్కేసినట్టుగా తెలుస్తోంది. అయితే అది జరగలేదు!

ఈ విషయంలో బాబు తరపున ఏపీ ప్రభుత్వ అధికారులు ట్రై చేశారట.. అయితే చివరకు మాత్రం అది దక్కనట్టుగా తెలుస్తోంది. దీంతో ఇక చేసేది లేక బాబు రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొనడానికి విజయవాడ వెళ్లిపోయాడని టాక్. ఒకవేళ రాష్ట్ర పతిభవన్ లో జరిగే విందులో పాల్గొనే అవకాశం దక్కి ఉంటే బాబు అమితంగా ఆనందపడే వాడేమో.. తన స్థాయి ఏమిటో అందరికీ తెలియజేయడానికి బాబుకు అంతకు మించిన అవకాశం ఉండేది కాదేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: