కొత్తగా ఉప ముఖ్యమంత్రి అయిన కడియం శ్రీహరిని శాసనమండలికే పంపించవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వరంగల్ ఎమ్.పిగా ఉన్నారు.ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వడంతో ఆయన ఎమ్.పి పదవికి రాజీనామా చేయవలసి ఉంటుంది. అయితే ఇందుకు ఆరు నెలల వరకు ఇబ్బంది ఉండదు.ఈలోగా శాసనమండలికి ఎన్నికలు జరుగుతాయి. స్థానిక సంస్థల నుంచి కాని, పట్టభద్రుల నుంచి కాని, లేదా ఎమ్మెల్యేల కోట లో గాని శ్రీహరిని ఎంపిక చేయవచ్చని అంటున్నారు. ఇప్పటికే నాయిని నరసింహారెడ్డి, మహమూద్ అలీ ఎమ్మెల్సీలుగా మంత్రులయ్యారు.తుమ్మల నాగేశ్వరరావు ,కడియం శ్రీహరి కూడా ఎమ్మెల్సీలుగా ఎన్నిక అవ్వాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: