భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 104 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. అందులో తొమ్మిది మందికి పద్మ విభూషన్, 20 మందికి పద్మభూషణ్, 75 మందికి పద్మశ్రీ కటించారు. అయితే వీరిలో ఎక్కువ మంది భాజపా అనుకూల భావజాలం ఉన్నవారేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాంటివారికే అవార్డులు ఇచ్చారని విమర్శకులు అంటున్నారు. అవార్డుల ప్రకటనకు ముందే ఇలాంటి చెందిన ఇంకొందరు స్వామీజీలకు మాత్రం స్థానం కల్పించారు. .

అలాగే బీజేపీ ప్రచార చిత్రాలకు పనిచేసిన ప్రసూన్ జోషి, గాడ్సే అనుకూల సినిమా తీసిన అస్సాంకు చెందిన బారువా వంటివారు ఇలాంటి కారణాలతో అవార్డులకు ఎంపికయ్యారని అంటున్నారు. మన రాష్ట్రానికి చెందిన కోట శ్రీనివాసరావు చాలాకాలంగా బీజేపీలో ఉన్నారు. ఆయన రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నా, లేకున్నా.. బీజేపీ అధికారంలోకి వచ్చినా, రాకున్నా కూడా ఆ పార్టీని వీడకుండా కొనసాగుతున్నారు. ఆయనకూ ఇప్పుడు పద్మశ్రీ అవార్డు ప్రకటించారు. అయితే, సినీరంగంలో కోట శ్రీనివాసరావు సుదీర్ఘ అనుభవం, సమాజంలో ఆయనకున్న పేరు ప్రఖ్యాతుల పరంగా చూస్తే ఆయన ఈ అవార్డుకు పూర్తిగా అర్హులే.

అదే సమయంలో అవార్డుకు ఎంపికైన మరికొందరిపై మాత్రం రైట్ వింగ్ కు చెందినవారన్న ముద్ర ఉంది. ఈ నేపథ్యంలోనే వారు పురస్కారాలకు ఎంపికయ్యారని చెబుతున్నారు.

.

మరింత సమాచారం తెలుసుకోండి: