బంగ్లాదేశ్ నుండి చొరబడుతున్న అక్రమ ప్రవేశకులను మన ప్రభుత్వాలు నిరోధించకపోవడం మనదేశ జనాభా పెరుగుదలకు నేపథ్యం. ఈ అక్రమ ప్రవేశకులలో మతోన్మాద తీవ్రవాదులు, సాయుధ ఉగ్రవాదులు, విచ్ఛిన్నకారులు, అసాంఘిక, లైంగిక బీభత్సకారులు పెద్ద సంఖ్యలో ఉండటం భద్రతను భంగపరుస్తున్న విపరిణామం. దేశంలో దశాబ్దులుగా వివిధ మతాల మధ్య ఏర్పడిపోయిన జన నిష్పత్తి వైపరీత్యాలకు సైతం ఈ బంగ్లాదేశీయు అక్రమ ప్రవేశాలు కారణం. గత దశాబ్దిలో ఇస్లాం మతస్థుల సంఖ్య ఇరవై నాలుగు శాతం పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఈ చొరబాటుదారులే.

ఈ చొరబాటుదారులు ఇస్లాం మతస్థులు కావడం వల్ల దేశంలో మతం ప్రాతిపదికగా వైరుధ్యాలు తీవ్రతరం కావడానికి సైతం ఈ పెరుగుదల దోహదం చేస్తోంది. ఈ వైరుధ్యాల వల్లనే 1947లో దేశం మతప్రాతిపదికన ముక్కలయిన ప్రమాదం సంభవించింది. అక్రమ ప్రవేశకుల కారణంగా ఈ ప్రమాదం మరోసారి సంభవించవచ్చునన్నది దేశ భౌగోళిక సమగ్రత పట్ల నిబద్ధత కలవారి భయం. ఎందుకంటె ఇస్లాం మతస్థులు మెజారిటీగా ఉన్న భూభాగాలు అఖండ భారత్ నుండి విడిపోయి కొత్త దేశంగా, పాకిస్తాన్ ఏర్పడటం చరిత్ర. ఇప్పుడు మళ్లీ ఇస్లాం మతస్థులు మెజారిటీగా ఉన్న ప్రాంతాలను దేశం నుండి విడగొట్టడానికి అక్రమ ప్రవేశకులు దోహదం చేస్తున్నారన్నది సమగ్రతా నిష్ఠ కలవారి ఆందోళన. ఈ ఆందోళన అతార్కికం కాదు. ఇస్లాం మతస్థులు మెజారిటీగా ఉన్నందువల్లనే జమ్మూకాశ్మీర్‌ను దేశంనుండి విడగొట్టాలని విచ్ఛిన్నకారులు భావిస్తుండడం బహిరంగ రహస్యం. ఈ విచ్ఛిన్నకారులలో ఒకవర్గం వారు జమ్మూ కాశ్మీర్‌ను స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయాలని కలలు కంటుండగా మరో ముఠావారు జమ్మూ కాశ్మీర్‌ను పాకిస్తాన్‌లో అంతర్భాగం చేయాలని భావిస్తున్నారు.

అందువల్ల అస్సాం లో కూడ ఇస్లాం మతస్థులు మెజారిటీ అయినట్టయితే కాశ్మీర్ కథ ఆస్సాంలో పునరావృత్తం కాగలదన్న భయాందోళనలు అతార్కికం కాదు. చొరబాటుదారుల కారణంగా అస్సాంలోని అనేక జిల్లాలు ప్రస్తుతం ఇస్లాం మెజారిటీ జిల్లాలుగా మారి ఉన్నాయి. ఈ జిల్లాలలో 1947 నాటికి ఇస్లాం మతస్థులు అత్యల్ప సంఖ్యాకులన్నది చారిత్రక వాస్తవం. అందువల్ల జనాభా పెరుగుదల దారిద్య్ర నిర్మూలనను నిరోధిస్తున్న ఆర్థిక సమస్య మాత్రమే కాదు, వివిధ మతాలు స్వేచ్ఛగా సమానంగా అవలంబించగల తరతరాల భారతీయ సమాజ స్వభావాన్ని చెరచివేసే సాంస్కృతిక సమస్యగా మారిపోయింది. ఈ సర్వమత సమానత్వ భాతీయ స్వభావం పాకిస్తాన్‌లో చెరిపివేతకు గురికావడం 1947నుండి నడుస్తున్న కథ. ఇలా జనాభా పెరుగుదల సమస్య మనదేశంలో జాతీయ సమైక్యతతోను, భౌగోళిక సమగ్రతతోను ముడివడిన చారిత్రక సమస్య. అందువల్ల జనవిస్ఫోటనాన్ని నివారించడానికై ఈ దేశాన్ని ప్రేమించే, ఈ జాతీయతా అఖండత్వ నిబద్ధత గల ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఇలాంటి నిబద్ధతగల ప్రతి వారూ అన్ని మతాలలోను ఉన్నారు. వీరి సంఖ్య పెరగాలి. పెరగవలసింది కేవలం జనసంఖ్య కాదు.

జనవిస్ఫోటనం కొనసాగుతుండటానికి మరో ప్రధాన కారణం కుటుంబ నియంత్రణను అన్ని మతాలవారు సమానంగా పాటించకపోవడం. మతం కంటె జాతీయ హితం ప్రధానమన్నది మన దేశపు అనాది స్వభావం. ఈ స్వభావం ఉన్నవారు ఏమతం వారైనప్పటికీ దేశహితం దృష్ట్యా పరిమిత సంతానాన్ని పాటిస్తున్నారు. చైనా వంటి నిరంకుశ రాజ్యాంగ వ్యవస్థలున్న చోట అన్ని మతాలవారు సమానంగా ఒకే బిడ్డను కనాలన్న చట్టాన్ని అమలు చేశారు. ఫలితంగా చైనాలో జనవిస్ఫోటనం ఆగిపోయింది. జనసంఖ్య పెరుగుదల తగ్గుముఖం పట్టింది. అందువల్లనే చైనా ప్రభుత్వం ఈ నిబంధనను సడలించింది. చైనాలో ఇప్పుడు ఇద్దరు పిల్లలను కనడానికి దంపతులకు వీలు ఏర్పడింది. కానీ మన ప్రభుత్వాలు మాత్రం దశాబ్దుల తరబడి ఇలా అన్ని మతాలు సమాన ప్రాతిపదికపై కుటుంబ నియంత్రణను పాటించేందుకు వీలైన చట్టాన్ని రూపొందించలేదు. ఫలితంగా ఇస్లాం మతంలోని అధికాధికులు ఇద్దరు పిల్లల సూత్రాన్ని పాటించడం లేదన్నది ఇతర మతాలవారి ఆరోపణ. ఈ ఆరోపణ పూర్తిగా సత్యదూరం కాదు. ఎందుకంటే 1947లో దేశ విభజన తరువాత మొత్తం జనాభాలో ఆరుశాతం ఉన్న ఇస్లాం మతం వారి నిష్పత్తి 2011 జనగణన నాటికి పదునాలుగు శాతానికి పైగా పెరిగింది. ఈ మేరకు మొత్తం జనాభాలో హిందువుల నిష్పత్తి తగ్గింది కూడ నిరాకరించలేని నిజం... కానీ ఇలా హిందువల నిష్పత్తి తగ్గిపోయింది కాబట్టి మళ్లీ సమతుల్యం సాధించడానికి వీలుగా హిందూ దంపతులు ఎక్కువమంది పిల్లలను కనాలని పిలుపునివ్వడం కూడ సమష్టి జాతీయ ప్రయోజనానికి విరుద్ధమైన అంశం. పోటీపడి జన విస్ఫోటనం తీవ్రతను పెంచినట్టయితే దారిద్య్రం కూడ మరింత తీవ్రస్థాయికి చేరడం ఖాయం. కఠినమైన చట్టంతో చైనా జన నియంత్రణను సాధించింది. ఫలితంగా 2050 నాటికి మనదేశ జనాభా చైనా కంటె ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. చైనాకు మనకంటె మూడురెట్ల భూమి ఉంది. ప్రకృతి వనరులు ఉన్నాయి. అందువల్ల చైనా మనకంటె ఎక్కువ ఆర్థిక ప్రగతిని సాధించగలిగింది. భూమికీ జనసంఖ్యకు మధ్య నిష్పత్తి విషయంలో మనం చైనాతో సమానత్వం సాధించలేం. కానీ జనసంఖ్య పెరుగుదలను అరికట్టడం మాత్రం మనకు అనివార్యం. అందువల్ల హిందువులు నలుగురు పిల్లలను కనాలని పదిమందిని కనాలని పిలుపులు ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదు. ఇస్లాం మతస్థులలో కొందరికి పదిమంది సంతానం ఉండటం ఇలాంటి పిలుపులకు ప్రతిక్రియాత్మక ప్రేరణ కలిగించి ఉండవచ్చుగాక. ఎక్కువమందిని కనవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడం కూడ జనవిస్ఫోటనాన్ని పెంచడానికి దోహదం చేయగలదు. ప్రగతి కొలువు తీరనున్నది కాబట్టి ప్రగతి ఫలాలను అనుభవించడానికై జనం పెరగాలన్న చంద్రబాబు మాటలలో తర్కం ధ్వనించలేదు..తొంబయి ఐదుశాతం సంపద, వనరులు, అభివృద్ధి ఫలాలు ఐదు శాతం ప్రజలకు దక్కిపోయే విధంగా వాణిజ్య ప్రపంచీకరణ వ్యవస్థీకృతవౌతున్న దేశంలో మధ్యతరగతి వారు, నిరుపేదలు అధికాధిక సంతానాన్ని ఉత్పత్తిచేసినందువల్ల ప్రయోజనం ఏమిటి? ప్రగతి ఫలవృక్షానికి ఐదుశాతం ప్రజలు స్వాములు.. మిగిలిన తొంబయి శాతం జనానికి ఫలాలు సరే నీడ కూడ లభించని ప్రగతి ప్రపంచీకరణ వల్ల కొలువుతీరుతోంది. ప్రపంచీకరణను కాక వికేంద్రీకరణను సాధించినప్పుడు జనాభా పెరుగుదల సమస్య కాబోదు... అందువల్ల జనాభా పెరగడాలా? తగ్గాలా? అన్న అంశాలను సమష్టి జాతీయ హితం ప్రాతిపదికగా అన్ని మతాలవారు, కులాలవారు, భాషలవారు, ప్రాంతాలవారు, చర్చించుకోవాలి. ఈ జాతీయ అంతర్మథనానికి 2011 నాటి జనాభా లెక్కలు మరోసారి శ్రీకారం చుట్టగలగాలి. ఈ దేశాన్ని బంగ్లాదేశీయ అక్రమ ప్రవేశకులతో నింపాలా? అక్రమ ప్రవేశకులను వెళ్లగొట్టాలా? కొన్ని మతాలవారు మాత్రమే జాతిహితం కోసం సంతాన పరిమితిని పాటించాలా? మరికొన్ని మతాలవారు విచ్చలవిడిగా జనాభా సంఖ్యను పెంచాలా? లేక అందరికీ సమాన సూత్రం వర్తించాలా? మతం మార్పిడులు కొనసాగాలా? వద్దా? ఇవన్నీ అంతర్మధనకు ఇతివృత్తాలు..

మరింత సమాచారం తెలుసుకోండి: