రాజకీయాల్లో అవతలి వారు వేసే ప్రతి అడుగుపైనా రాద్ధాంతం చేయవచ్చు. తెలంగానలోని రాజకీయ పార్టీల తీరును గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేసుకొనే రాజకీయ పార్టీల తీరును చూస్తే దీనిపై క్లారిటీ వస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడం అనే వ్యవహారాన్ని పరిశీలిస్తే చాలు.

వైద్యశాఖలో జరిగిన అవినీతికి బాధ్యుడిగా రాజయ్యను కేసీఆర్ తప్పించడానేది మీడియాలో కథనం. అయితే ఈ అంశంపై కేసీఆర్ సూటిగా వివరణ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే... ఇప్పుడు దళితుడికి అన్యాయం జరిగిపోయిందని అంటున్నారు ప్రతిపక్షాల వాళ్లు, ప్రజా సంఘాల వాళ్లు.

మరి రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాకా.. ఆ పదవిని ఇచ్చిందికూడా మరో దళితుడికే. అయితే తీసేసిన దళిత నేత గురించే మాట్లాడుతున్నారు కానీ... పదవిలోకి వచ్చిన దళిత నేతల గురించి మాత్రం ప్రతిపక్షాల వాళ్లు, ప్రజా సంఘాల వాళ్లు మాట్లాడటం లేదు.

ముఖ్యమంత్రి పదవినే దళితుడికి ఇస్తానన్న కేసీఆర్ ఇప్పుడు ఒక దళితుడిని ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి అవమానించాడని వారు దుమ్మెత్తిపోస్తున్నారు. మరి దుమ్మెత్తిపోయడమే వారి పని కాబట్టి అదే చేస్తున్నారనుకోవాలి. ఒకవేళ రాజయ్యను పదవి నుంచి తప్పించకపోతే.. కేసీఆర్ పాలన అవినీతిమయమని వీరు దుమ్మెత్తిపోసేవారు కదా!

మరింత సమాచారం తెలుసుకోండి: