దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలకు తల్లి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ద్వారా గుర్తింపు సంపాదించుకొన్న ఎంతోమంది నేతలు వివిధ సందర్భాల్లో ఆ పార్టీ నుంచి బయటకువ చ్చారు. తమ దారి తాము చూసుకొన్నారు. కొత్త పార్టీలు పెట్టి కాంగ్రెస్ కే పక్కలో బల్లెంగా కూడా మారారు

మరి రాష్ట్రం వరకూచూసుకొంటే తెలుగుదేశం పార్టీ కొన్ని పార్టీలకు మదర్. తెలుగుదేశం నుంచి బయటకు వెళ్లిన కొంతమంది నేతలు కొత్త పార్టీలు పెట్టారు. అయితే అవి తిరిగి తెలుగుదేశంలోకి విలీనం కావడమే జరిగింది. మరికొన్ని ఆడ్రస్ లేకుండా పోయాయి. ఇటీవలి కాలంలో చూసుకొంటే దేవేందర్ గౌడ్ , బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్లు టీడీపీ నుంచి బయటకు వెళ్లి కొత్త పార్టీలు పెట్టి.. ఊసూరుమనిపించారు.

వారి సంగతి అలా ఉంటే.. ఇప్పుడు కృష్ణయ్య కొత్త పార్టీ గురించి చర్చ ఊపందుకొంటోంది. ఎలాగైనా కొత్త పార్టీ పెట్టాలనే నిర్ణయానికి వచ్చేశాడట ఆయన. వచ్చే ఎన్నికల్లోపు కొత్త పార్టీ ఖాయమని తెలుస్తోంది. బీసీ లందరినీ కలుపుకుపోయే శక్తిగా అవతరిస్తుందట ఆ పార్టీ. ఇప్పటికే చాలా మంది నేతలు ఈ అంశంపై కృష్ణయ్యతో చర్చలు కూడా జరుపుతున్నారనిటాక్.

మరి తెలంగాణలోని టీడీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది టీఆర్ఎస్ దారిన నడుస్తుంటే... కృష్ణయ్య మాత్రం సొంత పార్టీతో ముందుకు వెళతాడా?! లెట్ వెయిట్ అండ్ సీ!

మరింత సమాచారం తెలుసుకోండి: