తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్ ,డీజిల్ పై రెండు రూపాయల చొప్పున వాట్ విధిస్తే ,ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందనుకుంటే,దానివల్ల ఎక్కువ నష్టం జరుగుతోందని తేలుతోందని చెబుతున్నారు.దీనిపై వస్తున్న సమాచారం ఆసక్తికరంగా ఉంది. ప్రధానంగా లారీలు, ఇతర రవాణా వాహనాలు ఎక్కడ నుంచి బయల్దేరితే అక్కడ పూర్తిగా టాంక్ ఫుల్ చేసుకుని బయల్దేరుతుంటాయి.కాని ఇప్పుడు లీటరుకు రెండు,మూడు రూపాయల అదనంపు చెల్లింపు ఉండడంతో వారు ఇక్కడ కొనుగోలు చేయడం తగ్గించేశారట.ఒక వాహనం 300 లీటర్లు కూడా కొనుగోలు చేస్తుంటుంది. భారీ వాహనాలు అయితే 1400 లీటర్ల వరకు కూడా తీసుకుంటాయి.కాని ఈ వాహనాల వారు పొరుగు రాష్ట్రాలైన ఎపి, మహారాష్ట్ర,కర్నాటక ,చత్తీస్ గడ్ ఇలా ఆయా రూట్లలో ఉన్న ప్రాంతాన్ని బట్టి అక్కడే కొనుగోలు చేసి రావడం చేస్తున్నారు. ఒకవేళ తెలంగాణలో బయల్దేరే వాహనాలైతే కేవలం మినిమమ్ గా అంటే నామమాత్రంగా ఐదువందల రూపాయల ఆయిల్ కొనుగోలు చేసి,రాష్ట్రం దాటేవరకు దానిని వాడుకుని ,ఆ తర్వాత తక్కువ ధరకు ఆ రాష్ట్రాలలో కొంటున్నారట.దీంతో జాతీయ రహదారుల వెంబడి తెలంగాణలో అమ్మకం నలభై శాతం పైగానే పడిపోయిందని,మిగిలిన చోట్ల ఇరవై శాతం తగ్గింని చెబుతున్నారు. దీనితో ప్రభుత్వం వాట్ పై పునరాలోచన చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: