తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో NTVకి ప్రత్యేక స్థానం ఉంది. ఈటీవీ2, టీవీ9 మాత్రమే తెలుగులో 24 గంటల న్యూస్ ఛానళ్లుగా ఉన్న కాలంలో ఎన్టీవీ, టీవీ 5 ఇంచుమించు ఒకే సమయంలో ప్రారంభమయ్యాయి. వీటిలో ఎన్టీవీ ఎక్కువగా లైవ్ ప్రోగ్రామ్స్ కవర్ చేస్తూ... యాక్టివ్ ఛానల్ గా గుర్తింపు పొందింది. మొదట్లో టీవీ5లో పనిచేసిన.. సీనియర్ మోస్ట్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు NTVలో చేరడంతో పొలిటికల్ అనాలసిస్ ద్వారా మంచి పేరు సంపాదించింది. NTVతో పాటు భక్తి, వనిత టీవీలు కూడా నిర్వహిస్తూ.. వీటి యజమాని తుమ్మల నరేంధ్రనాథ్ చౌదరి జూబ్లిహిల్స్ సర్కిల్లో వీఐపీగా మారిపోయారు.  టాప్ న్యూస్ ఛానల్స్ మధ్య రేటింగ్ కాపింటీషన్ బీభత్సంగా ఉండటంతో.. వ్యూయర్ షిప్ కోసం అడ్డదారి తొక్కిన NTV ఇప్పుడు దాని ఫలితం అనుభవిస్తోంది. రెండేళ్ల క్రితం రాత్రివేళల్లో ఈ ఛానల్ సినీకలర్స్ పేరుతో.. మసాలా పాటల క్లిప్పింగ్స్ ప్రసారం చేసింది. రొటీన్ సినిమా క్లిప్పింగులు కాకుండా రేటింగ్ పెంచుకునేందుకు.. సినిమాల్లో లేని హాట్ సీన్స్ కూడా ఇందులో ప్రసారం చేశారు. ఎ సర్టిఫికెట్ సినిమాల్లో కూడా అనుమతించని సాఫ్ట్ పోర్న్ క్లిప్పింగ్స్ ప్రసారం చేశారు. దీనిపై ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ.. ఈ ఎపిసోడ్ పై ఎంక్వయిరీ వేసి... ఫిబ్రవరి 3 నుంచి ఓ వారం పాటు ఛానల్ పూర్తిగా ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది.  కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయంపై ఆందోళన చెందిన NTV యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. కేంద్ర ఉత్తర్వుల అమలు నిలుపుదల చేయాలంటూ అభ్యర్థించింది. ఆ ఆదేశాలు చట్టవిరుద్ధమైనవని వాదించింది. తమ వాదనను ప్రసార శాఖ ముందు లిఖితపూర్వకంగానూ, వ్యక్తిగతంగానూ హాజరై వివరణ ఇచ్చామని.. కానీ తమ వివరణను కేంద్ర ప్రసార శాఖ ఏమాత్రం పట్టించుకోకుండా ఈ ఆదేశాలిచ్చిందని వాదించింది. తాము కేవలం 3 నెలలు మాత్రమే ఈ కార్యక్రమం ప్రసారం చేశామని.. ఆ తర్వాత 2012లోనే నిలిపేశామని..ఇప్పుడు ప్రసారాలు నిలిపేయాలని చెప్పడం అసమంజసమని వివరించింది. మరి కోర్టు NTVకి ఊరట కల్పిస్తుందా.. నిషేధం ఎత్తివేస్తుందా.. వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: