ఇప్పటికే తెలుగుదేశం ప్రభుత్వం రైతు రుణమాఫీ వ్యవహారంలో ప్రజల ఆశలను అడియాసలు చేసింది. ఎన్నికల ముందు అన్ని రుణాలూ మాఫీ అని రైతుల్లోనూ డ్వాక్రా మహిళల్లోనూ ఆశలు రేకెత్తించిన తెలుగుదేశం వారు తీరా ఎన్నికలయ్యాకా ఆ వ్యవహారాలను ఎలా తయారు చేశారో చెప్పనక్కర్లేదు.

సంపూర్ణ రుణమాఫీ అనే అంశం గాలికి ఎగిరిపోయి... రుణమాఫీని ఐదేళ్ల సీరియల్ గా పొడిగించి... ఆ విషయంలో కూడా సవాలక్ష షరతులను పెట్టి చివరకు రైతులను ఆథోగతి పాల్జేశారు తెలుగుదేశం వాళ్లు. ఇప్పటికే పల్లెల్లో రుణమాఫీ అంశం గురించి తెలుగుదేశం నేతలను బండబూతులు తిట్టుకొంటున్న పరిస్థితి.

ఇదిలా ఉంటే మంత్రి నారాయణ ఇప్పుడు కొత్త మాటందుకొన్నాడు. లక్షన్నర లోపు రుణాలన్నింటినీ తక్షణమే మాఫీ చేస్తామని ఈయన ప్రకటించాడు. అది కూడా జనవరి 28 బుధవారాన్ని గడువుగా చెప్పి నారాయణ ఈ రుణాలన్నీ మాఫీ అంటున్నాడు. మరి ఇప్పటికిప్పుడు ఇదేంటి.. అంటే ఎవరికీ అర్థం కావడం లేదు.

ఇప్పటికే మంచో చెడో చంద్రబాబు ప్రభుత్వం రుణమాఫీ గురించి ఒక విధానాన్ని ప్రకటించింది. దీన్ని బట్టి ఐదేళ్లలో రుణమాఫీ అంశం తేలదు. అప్పటికి ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. అయితే మధ్యలో నారాయణ వచ్చి మళ్లీ ఇప్పటికిప్పుడు రుణమాఫీ, అన్ని రుణాలూమాఫీ అని అంటున్నాడు. మరి ఎవరిని వెర్రివాళ్లను చేయడానికో ఈ ప్రకటనలు!

మరింత సమాచారం తెలుసుకోండి: