తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుకు ఇప్పటికే ప్రచార పులిగా గుర్తింపు ఉంది. చేసేది గోరంత అయితే దాన్ని కొండతగా ప్రచారం చేసుకోవడం బాబుకు బాగా ప్రావీణ్యం ఉన్న విద్య. ఇక ఆది నుంచి బాబు కోసం ఏపీలో కొన్ని మీడియా వర్గాలు పనిచేస్తున్నాయి. అధికారంలో ఉన్నన్ని రోజులూ బాబును ఆ మీడియా వర్గాలు ఆకాశానికెత్తేశాయి. ఇక ప్రతిపక్షంలోకి వెళ్లాకా.. తిరిగి బాబును అధికారంలోకి తీసుకొచ్చేంత వరకూ ఆ మీడియా వర్గాలు నిద్రపోలేదు.

ఇలాంటి నేపథ్యంలో ఎట్టకేలకూ బాబు అధికారంలోకి వచ్చాడు. మరి ఇప్పుడు బాబుకు అధికారం సిద్ధించిన నేపథ్యంలో మీడియా తీరును గమనిస్తూనే ఉన్నాం. నవ్యాంధ్ర ప్రదేశ్ ను అభివృద్ధి చేయడానికి బాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని.. ఆయన నిద్రపోవడం లేదని మీడియా వార్తలు రాస్తోంది.

అసలు జనాలు ఏమైనా అనుకొంటారు.. అనే మొహమాటాలు కూడా లేకుండా బాబును ఆకాశానికెత్తేస్తోంది మీడియా. ఈ విషయంలో మీడియా నిస్సిగ్గుగా వ్యవహరిస్తోంది.. బాబు ఇమేజ్ ను పెంపొందించుకోవడానికి మీడియా తన ఇమేజ్ ను పణంగా పెడుతోంది అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

అయితే మీడియా ఇంతజేస్తున్నా చంద్రబాబు చాలడం లేదట. ఈ విషయాన్ని ఆయనే చెప్పాడు. మీడియా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించాలని..ఆయన డైరెక్టుగా వ్యాఖ్యానించేశాడు. మరి మీడియాఅంటే నిష్పాక్షికంగా ఉండాలని చెప్పాల్సింది పోయి.. తమకు అనుకూలంగా వ్యవహరించాలని బాబు బహిరంగంగానే వ్యాఖ్యానించేస్తున్నాడు. మరీ ఇలా మాట్లాడటం ఏమిటో!

మరింత సమాచారం తెలుసుకోండి: