దేశంలోనే తొలి వైఫై నగరంగా కోల్ కతా ముస్తాబుఅవుతుంది. రెండు నెలల్లోపు కోల్ కతాను పూర్తిగా “వైఫై” ను మార్చానున్నారు. కోల్ కతా లో మొత్తం 144 మున్సిపాల్ డివిజన్స్ లో ఈ వైఫై సేవలు అందించనున్నారు. ప్రైవేట్ సంస్థల బాగస్వామ్యం తో కోల్ కతా పార్క్ స్ట్రీట్ నుండి సర్వీసులను ఫిబ్రవరి 5 నుండి ప్రారంభించనున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ ఏప్రిల్ రెండో వారం నాటికి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని, అలాగే స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్స్ , ల్యాప్ టాప్ వినియోగదారులు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చని తెలియజేశారు. అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ దేశాలతో సమానం గా దూసుకెళ్తున్న భారత్, ఇలా వైఫై సేవలు ఉచితంగా అందించడానికి మెట్రో నగరాలు ముందుకురావడం శుబ పరిణామం.

మరింత సమాచారం తెలుసుకోండి: