హైదరాబాద్ లో భారీ పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. అంత పెద్ద మొత్తం లో పేలుడు పదార్థాలను చుసిన పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో ముమ్మర తనిఖీలు చేపట్టిన ప్రత్యేక పోలీస్ బలగాలు (ఎస్ఓటి) ఓ ఇంటిలో భారి సంఖ్యలో పేలుడు పదార్థాలను కనుగొన్నారు. పోలీసులు కనుగొన్న పేలుడు పదార్థాలలో భారి స్థాయి లో అమ్మోనియం డిటోనేటర్లు, నైట్రో గ్లిజరిన్ ఉన్నాయి. పేలుడు పదార్థాల నివకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఉగ్రవాద సమస్యతో సతమత మవుతున్న నగరం ఈ భారి పేలుడు పదార్థాల నిలవ తో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యింది. మళ్ళి నగరంలో ఏదైనా విపత్కర ఘటన జరగనుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పేలుడు పదార్థాల నిల్వ విషయం లో పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. మరో ముగ్గురు కీలక వ్యక్తులు పరారి లో ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా భారీ మొత్తం లో పేలుడు పదార్థాలు లభించిన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి..? ఎందుకోసం వీటిని నిలవ చేశారు అనే కోణం లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: