ఒక రాష్ట్ర రాజధాని నగరం నిర్మించడమంటే మాటలు కాదు.. అందులోనూ రాజధాని ప్రజల రాజధానిగా ఉండాలి.. దాదాపు కోటి మంది నివసించేలా ఉండాలి.. ఆకాశ హర్మ్యాలు, ఉద్యానవనాలతో విలసిల్లాలి.. వంటి కండిషన్లు పెట్టుకుని.. ఆ టార్గెట్ రీచ్ కావాలంటే.. చాలా సమయం పడుతుందన్న సంగతి తెలిసిందే. దాదాపు కోటిపైగా జనాభా ఉన్న హైదరాబాద్ నిర్మాణానికి కనీసం 400 ఏళ్లు పట్టింది. అలాంటింది.. ఆ స్థాయిలో ఏపీ రాజధాని నిర్మాణానికి ఎంత సమయం పడుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారంది.  నాలుగేళ్లలో ఆంధ్ర కొత్త రాజధానికి ఓ రూపు తీసుకువచ్చి.. దాన్ని చూపించి మళ్లీ ఎన్నికలు వెళ్లాలని టీడీపీ సర్కారు భావిస్తోంది. ఆమేరకు టార్గెట్ పెట్టుకుని పనులు చేస్తోంది. ఐతే.. బాబు ఎంత స్పీడుగా ఉన్నా.. రాజధాని నిర్మాణం.. ఒక్కరివల్ల అయ్యే పని కాదు.. ఎన్నో వ్యవస్థల సమన్వయంతో జరగాల్సిన బృహత్కార్యక్రమం. ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణానికి కనీసం 50 నుంచి వందేళ్లు పడుతుందని సీఆర్డీఏ కమిషనర్ చెప్పారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. అదే నిజమైతే.. ఆ సమయంలో.. భూములు అప్పగించేసిన రైతుల పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకమవుతోంది.  సీఆర్డీఏ కమిషనర్ ప్రకటనను వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. 100 ఏళ్ల పాటు నిర్మాణం చేప్పటం దారుణమంటున్నారు. భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభమై నెల రోజులు కావస్తుందని... 57వేల ఎకరాలు భూ సమీకరణ ప్రభుత్వం పెట్టుకుంటే ఇప్పటికే కేవలం 7500 మాత్రమే సమీకరించిందని ఆయన విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు.. మాత్రం భూసమీకరణకు రైతులు 90 శాతంకు పైగా అనుకూలంగా ఉన్నారని ప్రచారం చేశారన్నారు. అధికారులు రెండో పంట రైతులను వేయనీయమని సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ ప్రకటించడం.. ఎమర్జెన్సీని తలపిస్తోందని ఆయన మండిపడ్డారు. భూములు ఇవ్వని రైతుల పై ఆంక్షలు పెట్టనివ్వమని.. రెండో పంట వేసి తీరతామని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: