యత్భావం.. తత్భవతి అన్నారు పెద్దలు. అంటే మనం ఏది ఆలోచిస్తామో..అదే అవుతామన్న మాట.. మరి ఒక రాష్ట్ర పాలన యంత్రాంగంలో కీలకమైన స్థానాల్లో ఉన్న వ్యక్తుల ఆలోచనాతీరు.. మొత్తం రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నిర్దేశిస్తుంది.. కదా.. అందుకే.. ఆ కీలకమైన వ్యక్తుల మైండ్ సెట్ మార్చేపనిలో చంద్రబాబు ఓ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు, అధికార యంత్రాంగాన్ని యోగా బాట పట్టించాలని డిసైడ్ అయ్యారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర పాలనాయంత్రాంగాన్ని నడిపించే ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికార్లకు మూడు రోజుల యోగా శిక్షణా కార్యక్రమం ప్రారంభమవుతోంది.

ఈ యోగా ట్రైనింగ్ అలాంటిల్లాంటి అల్లాటప్పా వారితో కాకుండా.. వరల్డ్ ఫేమస్ జగ్గీవాసుదేవ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈషా పౌండేషన్ అధ్వర్యంలో భారీ స్ధాయిలో ఇస్తున్నారు. కేవలం యోగా మాత్రమే కాకుండా.. మేనేజ్ మెంట్ స్కిల్స్ పై కూడా శిక్షణ ఇస్తారట. ఆరోగ్యం కాపాడుకోవడం, సత్ప్రవర్తన, విజయసూత్రాలు వంటి అన్ని అంశాలపై కూలంకషంగా నేర్పిస్తారట. ముఖ్యమంత్రి, మంత్రులు, ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ ఎస్ అధికార్లు.. అంతా ఈ ట్రైనింగ్ తీసుకోవాల్సిందేనట. ఎవరికీ.. ఎలాంటి మినహాయింపులు ఇవ్వొద్దని బాబు స్ట్రిక్టుగా ఆర్డర్ వేశారట.

తొలిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నాలుగు సెషన్లుగా ఈ శిక్షణ ఉంటుందట. కేవలం మంత్రులు, అధికారులకు మాత్రమే కాదండోయ్.. వారి జీవిత భాగస్వామ్యులకూ ఈ ట్రైనింగ్ ఉంటుందట. ముఖ్యమంత్రితో కలుపుకుని మొత్తం 500 మంది వరకు ఈ శిక్షణాకార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం ఉంది. ఐతే.. ఈ ట్రైనింగ్ పిరియడ్ లో మాత్రం రాష్ట్ర పాలన కొంత వరకూ స్తంభించే అవకాశం ఉంది. మూడు రోజుల పాటు.. సచివాలయంతో పాటు జిల్లాల్లోని ప్రధానకార్యాలయాల్లోనూ స్తబ్దత నెలకొనే అవకాశం ఉంది.

.

మరింత సమాచారం తెలుసుకోండి: