అసలే లేటు బడ్జె ట్‌తో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్‌ ఖజానా తాజా గా రావాల్సిన అంచనా రాబడి రాకపోవడంతో కుదేలైంది. తాజా లోటు రూ.6,500 కోట్ల వర కూ ఉంటుందని అంచనా. దాంతో ఖజానా నుం చి చెల్లింపులను నిలిపివేస్తూ ఆంధ్రప్రదే ప్రభు త్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే జన వరి నెల జీతాల చెల్లింపునకు మాత్రం డబ్బులు ఉన్న ట్లు అధికార వర్గాలు తెలిపారు. రావాల్సిన ఆదా యాలపై స్పష్టమైన అంచనాలు లేకుండా ఖజా నాను ఖాళీ చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రూ. 6500 కోట్ల లోటులో పడిపో యింది. రాష్ర్టం ఏర్పడటమే లోటు బడ్జెట్‌తో ఏర్పడగా ఇపుడు దానికి రెవిన్యూ లోటు కూడా తోడవటంతో మూలిగే నక్కపై తాటికాయ పడిన ట్లైంది. చంద్రబాబునాయడు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 16500 కోట్ల లోటుతో మొదలైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే చంద్రబాబు మెడపై రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫి లాంటి కత్తులు వేలాడుతున్నాయి. ప్రభుత్వానికి ఆదాయాలను సమకూర్చే శాఖలైన కమర్షియల్‌ ట్యాక్స్‌, స్టాం ప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్లు, రవాణా, ఆబ్కారీ, అటవీ, గనులు-భూగర్భశాఖ, సిసిఎల్‌ఏల నుండి రెవిన్యూ రావటం మొదలైంది. అయితే, ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన రైతు రుణమాఫికి సంబంధించి ప్రభుత్వం హామీ నెరవేర్చు కోవటంలో భాగంగా రూ. 5 వేల కోట్లను రైతు సాధికర సంస్ధకు మళ్ళించారు.  ఇవి కాకుండా, చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ప్రమాణ స్వీకారం సందర్భంగా అయిన ఖర్చు, సచివాలయంలో తన చాంబర్‌ మరమ్మ తులకు అయిన వ్యయం, విదేశాలకు వెళ్ళినపుడు అయిన ఖర్చులు, ప్రత్యేక విమానంలో దేశీయంగా తిరగటానికి అవుతున్న ఖర్చులు, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన ప్రమాదాల్లో మరణించిన తెలుగు వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటిస్తున్న నష్టపరిహారాల లాంటి వాటితో ప్రభుత్వ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. వీటిన్నింటి ఫలితంగా రాష్ట్ర ఆర్దిక పరిస్ధితి సుమారు రూ. 6500 కోట్ల లోటులోకి దిగజారి పోయింది. రావాల్సిన ఆదాయాల్లో తరుగు దల, కేంద్రం నుండి వ స్తుందనుకున్న నిధులు రాకపోవటం, శాస్ర్తీయ విధా నంలో అంచనాలు లేకుండా ప్రకటిస్తున్న పథకాలు, వాటికి చేస్తున్న ఖర్చులు లాంటి వాటితో రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి కుదేలైంది. ఖర్చులను ఆపలేక, తగ్గించు కోలేక, ఆదాయలను పెంచుకోలేక, కేంద్రం నుండి నిధులను రాబట్టుకోలేక పోవటంతో ప్రభుత్వం సతమతమౌతున్నది.

దాంతో పై విభాగాల నుండి వచ్చిన రెవిన్యూలో అధికభాగం రుణమాఫీకే సరిపోయింది. అలాగే, తప్పని సరిగా చెల్లించాల్సిన ఉద్యోగుల జీతాలు ఎటూ ఉండనే ఉన్నాయి. ప్రతీ నెలా ఉద్యోగులకు సుమారు రూ. 3 వేల కోట్లు జీతాల రూపంలో చెల్లించింది. అప్పటికీ గత జూన్‌ నెల నుండి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు ఒక్క సారిగా చెల్లించాల్సిన వేలాది కోట్లాది రూపాయలు ఖజా నాలో లేని కారణంగా వారి ఉద్యోగ విరమణ వయస్సును కూడా ప్రభుత్వం పెంచింది. వివిధ శాఖల నుండి రెవిన్యూలు పెరుగుతున్నాయనుకుంటున్న దశలో ఉత్తరాంధ్రను హఠాత్తుగా హూదుద్‌ తుపాను దారుణంగా దెబ్బతీసింది. దాని వల్ల ప్రభుత్వం సుమారు 800 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. దాంతో ఆర్దిక పరిస్ధితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఇవికాకుండా రివాజుగా శాఖల వారీగా జరగాల్సిన వ్యయం ఎటూ ఉండనే ఉంది. ఈ నేపధ్యంలో జనవరి నెలలో సం క్రాంతి పండుగ సందర్భంగా తెల్ల రేషన్‌ కార్డు దారులకు ‘చంద్రన్న పండుగ కానుక’ పథకాన్ని ప్రారంభించటంతో సుమారు రూ. 300 కోట్లు అదనపు ఖర్చు వచ్చింది.

ఇవి కాకుండా, చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ప్రమాణ స్వీకారం సందర్భంగా అయిన ఖర్చు, సచివాలయంలో తన చాంబర్‌ మరమ్మ తులకు అయిన వ్యయం, విదేశాలకు వెళ్ళినపుడు అయిన ఖర్చులు, ప్రత్యేక విమానంలో దేశీయంగా తిరగటానికి అవుతున్న ఖర్చులు, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన ప్రమాదాల్లో మరణించిన తెలుగు వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటిస్తున్న నష్టపరిహారాల లాంటి వాటితో ప్రభుత్వ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. వీటిన్నింటి ఫలితంగా రాష్ట్ర ఆర్దిక పరిస్ధితి సుమారు రూ. 6500 కోట్ల లోటులోకి దిగజారి పోయింది. రావాల్సిన ఆదాయాల్లో తరుగు దల, కేంద్రం నుండి వ స్తుందనుకున్న నిధులు రాకపోవటం, శాస్ర్తీయ విధా నంలో అంచనాలు లేకుండా ప్రకటిస్తున్న పథకాలు, వాటికి చేస్తున్న ఖర్చులు లాంటి వాటితో రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి కుదేలైంది. ఖర్చులను ఆపలేక, తగ్గించు కోలేక, ఆదాయలను పెంచుకోలేక, కేంద్రం నుండి నిధులను రాబట్టుకోలేక పోవటంతో ప్రభుత్వం సతమతమౌతున్నది.

.

మరింత సమాచారం తెలుసుకోండి: