పాలనలో తన మార్కు పాలన ఏంటో నిరూపించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మొండి పట్టుదలతో ఉన్నారు. డిప్యూటీ సీఎం, ఆరోగ్యమంత్రి అయిన టి.రాజయ్య తొలగింపు వ్యవహారమే ఇందుకు నిదర్శనం. రాజయ్య పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన్ను తొలగించేందుకు కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అయితే ఆయన కుమారుడు, రాష్ట మంత్రి కేటీఆర్ ఇందుకు ససేమిరా అన్నారు. తొలగిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, కనీసం తన మాట విని అయినా పదవిలో ఉంచాలని కోరారు. కానీ ఈ ప్రతిపాదనను కేసీఆర్ తిరస్కరించారు. అవినీతి మంత్రిని బర్తరఫ్ చేయాల్సిందేనని అన్నంత పని చేశారు. మొత్తంగా మంత్రి తొలగింపు అవినీతి వ్యతిరేక చర్యగా ప్రజల్లో సానుకూల సందేశాన్నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: