రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఐఏఎస్‌ అధికారులు రోజంతా ఉదయం 9 గంటల నుండి సాయం త్రం 5 వరకు యోగాలోనే ఉన్నారు. దీంతో సచివాలయంలో మంత్రులు, అధికారులు లేకపోవడంతో బోసిపోయింది. మూడు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగనుంది. గురువారంనాడు ఉదయం ముఖ్యమంత్రి శిక్షణను యోగా గురువు జగ్గు వాస్‌దేవ్‌ నేతృ త్వంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, వ్యక్తిలో జీవన నైపుణ్యాల పెంపుతోపాటు, వృత్తి నైపుణ్యాలను పెంచాలనే ఉద్దేశంతో ఈ రకమైన శిక్షణా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు పేర్కొ న్నారు. ఒత్తిడిని అధిగమించడం ఇందులో ప్రధాన అంశమన్నారు. సమస్యలను సమర్థ వంతంగా ఎదుర్కొనేందుకు ఈ రకమైన శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. ఆనారోగ్య సమ స్యలను దరిచేరకుండా జాగ్రత్త పడవచ్చ న్నారు. యోగాను ఐక్యరాజ్యసమితి గుర్తించి దీని ప్రధాన్యతను ప్రపంచానికి తెలియ చెప్పేలా ప్రపంచ యోగా దినోత్సవాన్ని ప్రకటించడం విశేషమన్నారు.

మంత్రులు, ఐఏఎస్‌ అధికారులు యోగా శిక్షణ కార్యక్రమంలోకి వెళ్ళడంతో రాష్ట్ర సచి వాలయం ఖాళీ అయ్యింది. నిత్యం మంత్రులు, ఐఏఎస్‌ అధికారులు సచివాలయంలో కొలువ తీరడం వలన వారితో పనులు చేయుంచు కునేందుకు వచ్చే సందర్శకులతో సచివాల యంతో పాటు వాహనాల పార్కింగిలూ కిటకిటలాడేవి. ఒక దశలో మనుషులు సులువుగా తిరగడానికి కూడా వీలులేకుండా కిక్కిరిపోయేది. అలాంటి సచివాలయం గురువారంనాడు బోసిపోయింది. దాదాపు నిర్మానుషంగా తయారైంది. 19 మంత్రుల్లో ప్రతిరోజు కొంతమంది మంత్రులు సందడి చేసేవారు. యోగా క్లాసుల కారణంగా మంత్రులు, వివిధ శాఖల ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, కమిషనర్‌లు సచివాలయానికి రాలేదు.

గతంలోనూ పండిట్‌ రవిశంకర్‌తో 'ఆర్ట్‌ఆఫ్‌ లివింగ్‌' గురించి శిక్షణ ఇప్పించారు. ప్రస్తుతం జగ్గు వాస్‌దేవ్‌ను రంగంలోకి దించారు. ఈ యోగా శిక్షణకు రాష్ట్ర ప్రభు త్వం సుమారు రెండు కోట్లు ఖర్చు చేయ నుందని సమాచారం. మరోవైపు నిధుల కొరతతో వివిధ పథకాలు, పనులకు కోతలు పెడుతూనే ఇలాంటి కార్యక్రమాలు హైదరా బాద్‌ నగరంలోని స్టార్‌ హోటల్‌లో నిర్వహించ డంపై ప్రభుత్వ వర్గాల నుండి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి కార్యక్రమం ఒక వేళ నిర్వహించాలనుకుంటే సెలవు దినాలను ఎంచుకుంటే పాలనకు ఇబ్బంది ఉండదని అంటున్నారు. పనిదినాల్లో ఇలాం టివి చేపట్టడం వలన మూడు రోజులపాటు అధికారులు విధులకు హాజరు కాకపోతే ప్రభుత్వ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతుందం టున్నారు. ఈషా పౌండేషన్‌ ద్వారా 'ఇన్నర్‌ ఇంజనీరింగ్‌ ఫర్‌ జాయిఫుల్‌ లివింగ్‌' అనే అంశంపై ఏర్పాటుచేసిన శిక్షణా కార్యక్రమా లను తొలుత మంత్రులు, ఐఏఎస్‌లకు నిర్వహించి రెండవ విడతలో ఎమ్మెల్యేలను కూడా ఇందులోకి తెచ్చి శిక్షణ ఇప్పించాలని చంద్రబాబు యోచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: