తెలంగాణ తెలుగుదేశం అగ్రనేతల వ్యవహారశైలి పైన పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమౌతోంది. పార్టీని ముందుకు నడిపించడం లో ముఖ్య నాయకులు అనుసరిస్తున్న తీరుపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కష్టాల్లో ఉన్న పార్టీని కాపాడుకోవాల్సిన నేతలు ఎవరికి వారే అన్నట్లు వ్యవహా రించడం కార్యకర్తలను కలవర పరుస్తోంది. అధికారపార్టీ ఒత్తిళ్ళతో సతమత మౌతున్న నేతలకు అండగా నిలువడంలో కీలక నాయకులు విఫలమయ్యారనే భావన కలుగుతుంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ చుక్కానిలేని నావాల త యారైంది. తెలుగుదేశంపార్టీకి నాయకత్వలేమి స్పష్టంగా కనిపిస్తోంది. కష్టాల్లో ఉన్న పార్టీని ముందుండి నడిపించే నాయకుడు లేక శ్రేణులు దిగాలు పడిపోతు న్నాయి. అనేక ఒత్తిళ్ళుతో విలవిలలాడుతున్న పార్టీ నేతలకు అండగా నిలచేవా రు కరువడంతో శ్రేణులు అందోళనకు గురువుతున్నాయి. ముఖ్యంగా అధికార టిఆర్‌ఎస్‌ దెబ్బకు ఇబ్బంది పడుతున్న పార్టీ కార్యకర్తలకు వెన్నుదన్నుగా అగ్రనా యకత్వం నిలబడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిత్యం వలసల ఊహా గానాలతో నైతిక స్ధైర్యం కోల్పోతున్న వారికి ధైర్యం చెప్పేవారే కరువయ్యారు.

ఎంఎల్‌ఏ స్ధాయి నుంచి క్షేత్రస్ధాయి క్యాడర్‌ వరకు ప్రతి ఒక్కరిలోను ఇదే భావ న వ్యక్తమౌతుంది. రాష్ట్ర విభజన తరువాత అధినేత చంద్రబాబు తెలంగాణశా ఖకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. టిటిడిపి అధ్యక్షుడిగా ఎల్‌.రమణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎర్రబెల్లి దయాకర్‌రావును నియమించారు. సీనియర్‌ నే తలైన మోత్కుపల్లి నర్సింహాలు, దేవేందర్‌గౌడ్‌, రేవంత్‌రెడ్డిలకు కీలక పదవుల ను కట్టబెట్టారు.ప్రత్యేకశాఖ ఏర్పాటు చేసిన క్రమంలో కొంత క్రియాశీలం గా వ్యవహారించిన వీరు ఆతర్వాత ఎవరికి వారే యుమునా తీరే అన్న చందంగా తయారయ్యారు. ప్రధానంగా టిటిడిపి అధ్యక్షుడి ఎల్‌.రమణ అంత చురుకుగా వ్యవహారించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తిస్ధాయిలో పార్టీపైన దృష్ఙి సారించడం లేదన్న ఆరోపణలు పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. పార్టీని ముం దుండి నడిపించాల్సిన రమణ పార్టీ కార్యక్రమాల్లో కొంత నిర్ల్లిప్తంగా ఉండ టంతో తెలుగు తమ్ముళ్లుకు ఇబ్బంది కరంగా మారింది. ఇక వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తోపాటు టిడిఎల్‌పి అధ్యక్షుడిగా వ్యవహారిస్తున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎ ్‌పి ఉపనేత రేవంత్‌రెడ్డికి మధ్య సమన్యయం కొరవడింది. కొన్ని వ్యవహారాల్లో ఇద్దరి మధ్య పొరపొచ్చాలు వచ్చాయని శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. రామేశ్వరరా వు వ్యవహారంలో విభేధాలు తారాస్ధాయికి చేరుకున్నాయి.

ఏకంగా చంద్రబాబు రంగంలోకి దిగి ఇద్దరి మధ్య సఖ్యత కుదర్చాలన్సి పరిస్ధితి దాపురించింది. అయినప్పటీ పైకి మాత్రం ఇద్దరు కలిసిమెలిసి పనిచేస్తామని చెబుతున్న లోపల మాత్రం ఒకరంటే మరోకరి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సీనియర్‌గా ఉన్న ఎర్రబెల్లిని లెక్క చేయకుండా రేవంత్‌రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. మీడియా సమావేశాలకు సైతం ఇద్దరు పోటీ పడుతుండటంతో పార్టీ వర్గాలకు చికాకు కలిగిస్తోంది. తెలంగాణ తెలుగు దేశం పార్టీ నుంచి వలసలను నివారించడంలోను శ్రేణులకు అండగా నిలవడం లోను చొరవ చూపడం లేదన్న వాదన వినిపిస్తోంది. సీనియర్‌ నేతగా ఉన్న ఎర్ర బెల్లి దయాకర్‌రావు మాత్రం కనీసం వెళ్లే నేతలతో పలుమార్లు మాట్లాడిన సంద ర్భాలు ఉన్నాయి. కిందిస్ధాయి నేతలకు సైతం ధైర్యం చెబుతున్నారు. 2019 తెలంగాణలో టిడిపి తరుపున సిఎం అభ్యర్ధిగా ప్రచారం చేసుకుంటున్న రేవంత్‌ రెడ్డి మాత్రం పార్టీ శ్రేణులను మాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల మహూ బూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన కొంతమంది పార్టీశ్రేణులు తమ ఎంఎల్‌ఏ వెళ్లిపో యారు. తమకు అండగా నిలిచేవారు కరువయ్యారు. మీరు మమ్మల్ని పట్టించు కోవాలని వారు విజ్ఞప్తి చేస్తే నిరద్వందంగా తోసిపుచ్చారు. తన నియోజక వర్గం తప్ప ఆయా నియోజక వర్గాల విషయంలో వేలు పెట్టేదిలేదని స్పష్టం చేయడం తో శ్రేణులు అసహనం వ్యక్తం చేశాయి.

టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపైన మడమ తిప్ప కుండా పోరాటం చేస్తున్న రేవంత్‌రెడ్డికి టిడిపిశ్రేణుల్లో విపరీతమైన క్రేజీ ఉంది. కెసిఆర్‌ మీద మాటల తూటాలు పేల్చే ఆయన సొంత పార్టీ నేతలతో కనీసం మాట్లాడటం లేదన్న విమర్శలున్నాయి.టిఆర్‌ఎస్‌ ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులకు గురువుతున్న ఎంఎల్‌ఏలకు అండగా నిలవడంలో రేవంత్‌ తీరు సరిగా లేదన్న విమర్శలు లొస్తున్నాయి. పార్టీ మారతారనే ప్రచారం జరుగుతున్న ఎంఎల్‌ఏ ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్ధిగా చెప్పుకునే రేవంత్‌ తమతో ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నిస్తుండటం విశేషం. మిగిలి న సీనియర్‌ నేతలు కూడా ఎవరిదారి వారిదే అన్నట్లు వ్యవహారిస్తున్నారు. కొంత మంది మీడియాకు పరిమితం అవుతుండగా మరి కొందరు ఆపని కూడ చేయ డం లేదు. స్వతంత్రంగా వ్యవహారించాలని చంద్రబాబు టిడిపి నేతలకు పదేపదే సూచిస్తున్నా వారు మాత్రం అధినేత చంద్రబాబు వైపే చూస్తున్నారు. ప్రతి చిన్న విషయానికి చంద్రబాబు లేదా లోకేష్‌ మీద ఆధారపడుతున్నా తీరు విమర్శలకు దారి తీస్తోంది. ఒకవైపు టిఆర్‌ఎస్‌ రాజకీయంగా దూకుడుగా వ్యవహారిస్తు టిడిపిని మింగేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈవిషయంలో తెలుగుదేశం అగ్రనాయకత్వం జాగ్రత్త గా వ్యవహారించక పోతే పార్టీ ఉనికికే ప్రమాదం వచ్చిపడుతుందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: