రాజధాని ప్రతిపాదిత ప్రాంత భూములను రైతుల నుంచి స్వాధీనం చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం రకరకాల మార్గాలను అన్వేషిస్తోంది. అధికారం చేతిలో ఉన్న నేపథ్యంలో ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకుండా ఉపయోగించుకొంటూ అక్కడి నుంచి రైతులను ఖాళీ చేయించడానికి ప్రయత్నాలు చేస్తోంది. నిన్నలా మొన్న తూళ్లు ప్రాంతంలో పంటలు సాగు చేయడానికే వీలు లేదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయించింది.

తద్వారా వేల ఎకరాల్లో పంటల సాగుకు పుల్ స్టాప్ పెట్టించే ప్రయత్నం చేసింది. దీనిపై నిరసనలు వెళ్లువెత్తుతుండగానే ఇప్పుడు బాబు గవర్నమెంటు ఆ ప్రాంత రైతులకు మరోషాక్ ను ఇచ్చింది. తూళ్లురుమండలంలో యూరియా, ఎరువుల సరఫరాలను నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

మరి రైతులకు ఎరువులు, యూరియాలను సరఫరాలను నిషేధించడం ఏమిటి? అంటే.. ఇదంతా వ్యూహాత్మకం. అలా నిషేధిస్తే రైతులకు మరో అవకాశం లేకుండా పోతుందని.. పంటల సాగు ఆగిపోతుందని ప్రభుత్వం లెక్కలేసుకొంది. ఈ మేరకు చర్యలు తీసుకొంది. ఈ అంశం గురించి క్యాబినెట్ లో చర్చించి మరీ నిర్ణయం తీసుకొన్నారట. రైతులను అడ్డుకోవడానికి ఈ వ్యూహాన్ని రచించినట్టుగా తెలుస్తోంది.

ఈ విషయాన్ని రైతులు వ్యవసాయ శాఖ మంత్రి పుల్లారు దృష్టికి తీసుకెళ్లారట. ఆయన రైతుల ముందే అధికారులకు ఫోన్ చేశారట. అయితే అధికారులు ఘాటుగా స్పందించారట. ప్రభుత్వ నిర్ణయంతోనే ఇలాంటి చర్యలు చేపట్టినట్టుగా స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో సదరు మంత్రి సైలెంటయి.. రైతులకు ఏదో సర్దిచెప్పి పంపించాడు. ఇలా ఉన్నాయి ఏపీ ప్రభుత్వ వ్యవహారాలు!

మరింత సమాచారం తెలుసుకోండి: