ఈ భూమ్మీద పనికిరాని మనిషనే వాడే ఉండడు. ఎందుకంటే.. మనిషి మెదడు.. కంప్యూటర్ కంటే వేలరెట్లు శక్తివంతమైంది. మరి ఎందుకు అందరూ జెమ్స్ కాలేకపోతారు. కొందరే ఎందుకు సక్సస్ అవుతారు.. దానికి సమాధానం ఒక్కటే.. ఆ మెదడును సరిగ్గా వాడుకోకపోవడమే. మరి మెదడును ఎలా వాడుకోవాలి..? అందుకు ఏమైనా ట్రైనింగ్ అవసరమా..అంటే అవునంటారు వ్యక్తిత్వ వికాస నిపుణులు.. ఏపీ సర్కారు నిర్వహిస్తున్న జాయ్ ఫుల్ లివింగ్.. శిక్షణ ద్వారా కూడా ఇన్నర్ టాలెంట్ ను వెలికి తీస్తున్నారు.

ఆంధ్రా సీఎం చంద్రబాబు విషయానికి వస్తే.. ఆయన ఎప్పుడూ సీరియస్ గా ఉంటారు. రోజుకు 16 గంటలు కష్టపడతానంటారు. బాబు కాస్త నవ్వుతూ.. జోవియల్ గా ఉండే దృశ్యాలు చాలా తక్కువ. అలాంటిది ఇక ఆయన డ్యాన్స్ చేయడమంటే.. దాదాపు అసాధ్యమే అని అంతా అనుకుంటారు. ఇప్పటివరకూ అలాంటి సన్నివేశాలు, సందర్భాలు మీడియా దృష్టిలో పడలేదు కూడా.

ఈ ఇన్నర్ ఇంజనీరింగ్ ఫర్ జాయ్‌ఫుల్ లివింగ్‌లో శిక్షణలో మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు యోగాతో పాటు డాన్స్ కూడా చేశారని వార్తలు వస్తున్నాయి. ఒక్క చంద్రబాబే కాదు.. ఆయనతో పాటు మంత్రులు, అధికారులు కూడా డాన్సులు చేశారట. ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ శిక్షణ లో ఈ డాన్సులు కూడా ఓ భాగమేనట. చంద్రబాబు ఓ ఐదునిమిషాల పాటు డాన్స్ చేశారట. మిగిలిన మంత్రులు, అధికారులు మాత్రం అరగంట వరకూ ఆ తన్మయత్వంలోనే ఉండిపోయారట.

ఏదేమైనా ఏపీ మంత్రులు, అధికారులకు చంద్రబాబు భలే మేలు చేశారు. ఎప్పుడూ సమీక్షలు, మీటింగులు, క్షేత్రస్థాయి పర్యటనలతో బిజీగా ఉండే వారంతా.. ఈ ట్రైనింగ్ పుణ్యమా అని కాస్త రిలాక్సవుతున్నారు. బిజీ బిజీ జీవితంతో పాటు.. జీవనానికి పనికొచ్చే అంశాలను కూడా కాస్త నేర్చుకుంటున్నారు. మరి ఈ శిక్షణ ప్రభావం పరిపాలనపై ఎంతవరకూ ఉంటుందో.. ముందు ముందు కానీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: