కొద్ది కాలం క్రితం వరకు ఎపి ఆదాయం బాగా పెరిగిందని వార్తలు వస్తుండేవి. ఇప్పుడు ఎపి బడ్జెట్ అంతా గందరగోళంగా మారిందని, ఆదాయం మూరెడు, వ్యయం మాత్రం బారెడు అన్నట్లు ఉందని కధనాలు వస్తున్నాయి. కేంద్రం నుంచి డబ్బులు ఏమైనా వస్తేనే అభివృద్ది చేయగలుగుతామని చెబుతున్నారంటూ సమాచారం వస్తోంది.

ఎపిలో లక్ష కోట్ల బడ్జెట్ లో ఏభైఐదు వేల కోట్లు జీతాలకు,అప్పులు,పించన్ల చెల్లింపులకు వ్యయం అవుతుందని, మరో పదిహేనువేల కోట్లు ఇతర రాయితీలకు అవుతుందని లెక్కలు చెబుతున్నారు.మరో ముప్పైవేల కోట్లను కేంద్రం నుంచి కాని, అప్పుల ద్వారా కాని తేవాలని చెబుతున్నారు.

ముందుగా రాష్ట్రం డెబ్బైవేల కోట్ల ఆదాయం తెచ్చుకోవాలని ఆర్ధిక శాఖ సూచిస్తోంది.అలాకాక నలబై వేల కోట్ల ఆదాయంతో డెబ్బైవేల కోట్ల ఖర్చు పెట్టాలంటే మాత్రం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు అందుకు అవకాశం ఇస్తారా?ఏమిటో ఈ లెక్కలు.

ప్రభుత్వం వీటి గురించి బహిరగంగా చెబితే తప్ప వాస్తవాలు తెలియవేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: