చాలామంది తల్లిదండ్రులు పిల్లలు కాస్త చదువులో వెనకపడగానే మొద్దు అని ముద్ర వేసేస్తారు.. భవిష్యత్తులో ఎందుకూ పనికిరాడని నిందిస్తుంటారు. కానీ ఓ స్థాయికి వెళ్లిన చాలా మంది చిన్నతనంలో చదువులో వెనుకబడ్డవారే. అంతెందుకు.. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్ స్టీన్ ను స్కూల్ వాళ్లు ఎందుకూ పనికిరాడని.. ఇంటికి పంపేస్తే.. ఐన్ స్టీన్ తల్లే.. స్వయంగా ఇంట్లోనే చదువు చెప్పిందట.

ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా అదే కోవలోకి వస్తారు. ఎలాంటి ఎన్నికల్లోనూ గెలవకుండానే హఠాత్తుగా రాజకీయ నాయకుడిగానూ, మంత్రిగానూ రూపాంతరం చెందిన వ్యక్తి నారాయణ. ఇప్పుడు ఏపీ మంత్రివర్గంలో ఈయన చాలా కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రత్యేకించి ఏపీ రాజధాని నిర్మాణం వ్యవహారాలు దగ్గరుండి చూసుకుంటున్నారు.

రాజకీయాల్లోకి రాక ముందు నారాయణ.. నారాయణ విద్యాసంస్థల యజమానిగానూ ప్రజలకు సుపరిచితుడే. నారాయణ విద్యాసంస్థల స్థాపనతో ఉన్నత విద్యను కొత్తపుంతలు తొక్కించిన నారాయణ.. ఒకప్పుడు టెన్త్ ఫెయిలయ్యారంటే నమ్మడం కష్టమే కానీ.. ఈ విషయం ఆయనే స్వయంగా వెల్లడించారు.

గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన తన గతాన్ని నెమరేసుకున్నారు. పదో తరగతి ఫెయిలైనా.. కసితో కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చానన్నారు. 1979 నుంచి తనకు విద్యావ్యవస్థతో అనుబంధం ఉందని.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: