రైతులకు, డ్వాక్రా మహిళలకు మద్దతుగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌. జగన్మోహన్‌రెడ్డి పశ్చిమగోదావరిజిల్లా తణుకులో రెండు రోజుల దీక్షను శనివారం ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీని నమ్ముకుని రాష్ట్రవ్యాప్తంగా మోస పోయిన రైతులకు అండగా నిరాహారదీక్షకు పూనుకు న్నట్లు చెప్పారు. గతంలో మండల, జిల్లా కేంద్రాలను ముట్టడించామని, ఇప్పుడు దీక్ష చేపడుతున్నామని తెలిపారు. రెండోరోజు ముగింపు సందర్భంగా తాను మాట్లాడతానని చెప్పారు. ఆ పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని మాట్లాడుతూ మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్ర బాబు రాష్ట్రంలో రైతులను, మహిళలను నిలువునా ముంచేశారని విమర్శించారు.

చంద్రబాబు చేతిలో వంచనకు గురైన రైతులు, మహిళలు తమ జిల్లాలోనే ఎక్కువగా ఉన్నార న్నారు. పశ్చిమలో తమ పార్టీ తరఫున ఒక ప్రజాప్రతినిధీ గెలవకపోయినా ఇక్కడ రైతులకు అండగా జగన్‌ దీక్షకు పూనుకున్నారని చెప్పారు. వైసిపి నాయకురాలు లకీëపార్వతి మాట్లా డుతూ.. జగన్‌ అవినీతిపరుడు కాదని, అత్యంత అవినీతి పరుడు చంద్రబాబేనని అన్నారు. తాను ఈ విషయాన్ని ఎన్‌టిఆర్‌ భార్యగా, చంద్రబాబు అత్తగా చెబుతున్నానని పేర్కొన్నారు. 2013 భూసేకరణ చట్టం ఉన్నప్పటికీ సిఆర్‌డిఎ పేరుతో రాజధాని కోసం రైతుల భూములు గుంజుకుంటున్నారని, ఇది అన్యాయమని పేర్కొన్నారు. రుణమాఫీపై తొలి సంతకం అని చెప్పి రైతులను, మహిళలను మోసగించారన్నారు.

మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ఈ ఏడాది రూ.56,900 కోట్ల రుణాలను రైతులకు ఇవ్వాల్సి ఉండగా, రూ.13 వేల కోట్లే అందజే శారని... ఇదంతా చంద్రబాబు రుణమాఫీ పేరిట చేసిన మోసానికి పరాకాష్టేనన్నారు. సింగపూర్‌లో వ్యవసాయం లేదని, ఇక్కడ కూడా అటువంటి పరిస్థితి తెచ్చేందుకే ఆంధ్రాను సింగపూర్‌ చేస్తానని చంద్రబాబు చెప్తున్నారన్నారు. మాజీ ఎంఎల్‌ఎ కారుమూరి నాగేశ్వరరావు, ఎంఎల్‌సి శేషుబాబు, వైసిపి రైతుసంఘం నాయకులు ఎస్‌విఎస్‌.నాగిరెడ్డి, ఎంఎల్‌ఎ గోవర్థనరెడ్డి తదితరులు మాట్లాడు తూ బాబు వస్తే జాబు వస్తుందన్నారని, బాబు రాగానే జాబులు పోతున్నాయని అన్నారు. ధాన్యానికి మద్దతు ధర లేదనీ, యూరియా బ్లాక్‌లో అధిక ధరలకు కొనుక్కోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు.

ఎంఎల్‌ఎ, సినీ నటి రోజా, వాసిరెడ్డి పద్మావతి, కొడాలి నాని, కొత్తపల్లి సుబ్బారాయుడు, జ్యోతుల నెహ్రూ, వనిత తదితరులు దీక్షలో పాల్గొన్నారు. వైసిపి పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి, ఎంఎల్‌ఎ చెవిరెడ్డి భాస్కరరావు, వంకా రవీంద్ర, కారుమూరి నాగేశ్వరరావు దీక్ష ఏర్పాట్లలో ప్రధాన భూమిక వహించారు. ఆ పార్టీ ముఖ్యనాయకుడు మైసూరారెడ్డి దీక్షకు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: