చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని ఈ-మెయిల్ ద్వారా బెదిరించి రూ. 25 కోట్లను డిమాండ్ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారితోపాటు మరో ఇద్దర్ని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌కు చెందిన వెంకటరమణరెడ్డి జనవరి 8వ తేదిన 25 కోట్ల రూపాయాలను ఇవ్వాలని ఈమెయిల్ ద్వారా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని బెదిరించాడని, బెంగళూరుకు చెందిన కుమార్, రాజేష్‌లతో కలిసి డబ్బు వసూలుకు ప్లాన్ చేశాడని పోలీసులు తెలిపారు.

ఎన్నికల్లో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పూర్తి ఆస్తుల వివరాలు వెల్లడించకుండా తప్పుడు పత్రాలు సమర్పించారు. ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు మా వద్ద ఉన్నాయి. ఎన్నికల సంఘానికి సమర్పిస్తే మీ ఎంపీ పదవి రద్దవుతుంది. ఇదంతా జరగకూడదంటే మాకు 25 కోట్ల రుపాయాలను ఇవ్వాలి అని ఈ-మెయిల్‌లో వెంకటరమణరెడ్డి డిమాండ్ చేశాడని పోలీసులు చెప్పారు.

ఈ-బెయిల్ బెదిరింపుపై ఎంపీ సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు డెకాయ్ అపరేషన్ చేసి ముగ్గుర్ని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. వెంకటరమణరెడ్డి రాయలసీమకు చెందిన మాజీ ఎంపీకి సమీప బంధువని సమాచారం.

..

మరింత సమాచారం తెలుసుకోండి: