టీడీపీ ఎన్నికల హామీలను తుంగలో తొక్కిందని ఆరోపిస్తూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నిరశన దీక్షకు ఉభయగోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతులు, మహిళలు హాజరయ్యారు. చంద్రబాబుది ప్రజావ్యతిరేక పాలనగా అభివర్ణిస్తూ గతంలోనే నరకాసుర వధ, మండల జిల్లా స్థాయి ధర్నాలు చేపట్టిన వైసీపీ ఇప్పుడు మరో నిరసన కొనసాగిస్తోంది.

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రెండురోజుల నిరాహార దీక్షకు కూర్చుకున్నారు. శనివారం వైస్సార్ విగ్రహానికి పూలమాల నివాళి అర్పించిన అనంతరం జగన్ దీక్ష ప్రారంభించారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణమాఫీ చేస్తానని నమ్మించి చంద్రబాబు వంచనకు గురిచేశారని ఆరోపిస్తోంది వైసీపీ.

బాబు వస్తే జాబు పేరుతో యువతను ఆకర్షించి, ఇప్పుడు జాబు పోయేలా చేస్తున్నారని దుయ్యబడుతోంది. మొత్తంగా.. ఎన్నికల వేళ టీడీపీ ఇచ్చిన హామీలను మరచి ఇష్టారాజ్యంగా వ్యహరిస్తోందని ఆరోపిస్తోంది. అయితే జగన్ చర్యలను అనవసర రాద్దాంతంగా చెబుతోంది టీడీపీ.

...

మరింత సమాచారం తెలుసుకోండి: