ఎన్నికల జాతరలో మద్యం, డబ్బుల పంపిణీ, రిగ్గింగ్, బూత్ ల ఆక్రమణ, గొడవలు.. ఇవన్నీ మన దేశంలో కామన్. మరి అమెరికాలో ఎన్నికలు ఎలా జరుగుతాయి? మనకు వాళ్లకి తేడా ఏంటి? అమెరికాలో ఎన్నికలకోసం ఓటర్లు ఎదురు చూస్తుంటారు, భారత్ లో ఎలక్షన్లకోసం రాజకీయ నాయకులు ఆశపడుతుంటారు. అక్కడికీ ఇక్కడికీ ఎన్నికల ప్రక్రియల్లో ఎంతో తేడా ఉంది. అమెరికా ఓటర్లకి అధ్యక్ష ఎన్నికలు ఓవరం. ఎన్నికల సమయంలోనే తమ సమస్యలన్నిటికీ పరిష్కారాలు కనుక్కుంటారు అక్కడి ప్రజలు. స్వార్థ ప్రయోజనాలకోసం కాకుండా దేశ ప్రయోజనాలకోసం ఎన్నికలని ఉపయోగించుకుంటారు. ఎలక్షన్ల టైమ్ లో అమెరికాలో ఓటర్ల పవరేంటో తెలుస్తుంది. భారత్ లో మాత్రం ఓటర్ల బలహీనతలు బయటపడతాయి. 1) ఇక్కడ రిగ్గింగ్ కామన్ - అమెరికాలో ప్రతి ఓటుకీ ప్రత్యేక రశీదు ఇస్తారు 2) భారత్ లో ఎన్నికలంటే ప్రభుత్వ సెలవు, అమెరికాలో సెలవూ లేదు 3) ఇక్కడ పోలింగ్ బూత్ లు స్కూళ్లు, కాలేజీలు - అక్కడ లైబ్రరీలు, పోలీస్ స్టేషన్లు, గ్యారేజీల్లో  పోలింగ్ 4) మనదేశంలో పోలింగ్ ఏజెంట్లుగా టీచర్లు, ఉద్యోగులు - అమెరికాలో హైస్కూల్, కాలేజీ స్టూడెంట్స్ 5) ఇక్కడ ఒకేరోజు ఓటింగ్ ప్రక్రియ - అక్కడ ముందస్తు ఓటింగ్ కి ఏర్పాటు ఇవే కాదు.. అమెరికాలో ఓటర్ ఎంత బలమైనవాడో చెప్పడానికి చాలా ఉదాహరణలున్నాయి. వికలాంగులకి కూడా ఓటింగ్ కోసం ప్రత్యేక సదుపాయాలున్నాయి. చూపులేని వారికి ప్రత్యేక బ్యాలెట్, వినికిడి సమస్య ఉన్నవారికోసం ఆడియో బ్యాలెట్ అందుబాటులో ఉంటాయి. భారత్, చైనా జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఇంగ్లీష్, హిందీ, చైనా భాషల్లో బ్యాలెట్ ని ముద్రిస్తారు. మనదేశంలో ఎలక్షన్ రోజు సెలవిచ్చినా చాలామంది ఓటేయడానికి బద్ధకిస్తారు. అమెరికాలో సెలవు లేకపోయినా.. ఆఫీసులకి వెళ్లేముందు, వచ్చిన తర్వాత ప్రతి ఓటరూ తన హక్కు వినియోగించుకుంటాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: