ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏం చేసినా ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది. కారణం ఆయన తీసుకునే నిర్ణయాలు సమాయానుకూలంగా ఉంటాయి మరియు సందర్భోచింతంగా ఉంటాయి. ఆయన మాటల ద్వారా ఎవరినైనా ఆకట్టుకోగలరు ఇందులో సందేహమే లేదు. అంతే కాదు ఆయన ఏ కార్యక్రమంల చేసినే అది ప్రజలకు ఎంత చేరువైందని ఎంత ప్రయోజనం ఉంటుందని ప్రతీ సారీ సమీక్షుంచుకుంటారు. మరుగున పడుతున్న ప్రసార భారతి కొత్త మెరుగులు దిద్ది అందులో ‘ మన్ కీ బాత్ ’ అనే వినూత్న కార్యక్రమానికి నాంది పలికారు దీని ద్వారా ఆయన ప్రతి సామాన్యునికి తన మనసులో మాట తెలుసుకోవాలనే సదుద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని రేడియోలో ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన తన మన్ కీ బాత్ లో ఈ పర్యాయం 10, 12వ తరగతి పిల్లలకు పాఠాలు చెప్పారు. పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలో, ఎలా రాయాలో కళ్ళకు కట్టినట్టు వివరించారు. పిల్లలకు ఏ విషయంతో తమ వర్తమానాన్ని పోల్చితే వారు శ్రద్ధగా వింటారో కూడా పసిగట్టారు.

అందుకే క్రికెట్ ను తన పాఠంలోకి తీసుకువచ్చారు. తన భార్య ఉపాధ్యాయురాలే... కానీ ఆమె కలసి ఉన్న రోజులు చాలా తక్కువే అయినా... గురువుగారి లక్షణాలు మోడీకి చాలా బాగా అబ్బినట్టున్నాయి. అంతే కాదు తన రాత సరిగా ఉండదని వ్రాయడం కూడా బాగా నేర్చుకోవాలని చెబుతూ అలాగే మీరు కూడా పరీక్షలు రాయాలి. మీ టీచర్లు కూడా ఈ విషయాలు చెప్పి ఉండొచ్చు.

ముందుగా బాగా తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు రాయండంటూ గొప్ప అనుభవం ఉన్న ఉపాధ్యాయుడిలా నరేంద్ర మోడీ వ్యాఖ్యానించడం ముచ్చటేసింది. గతాన్ని, భవిష్యత్తును వదిలేయండి. వర్తమానంలో ఉండి పరీక్షలు రాయాలంటూ హితవు పలుకుతూ పిల్లల్ని ఇట్టే ఆకట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: