రైతు రుణమాఫీ.. అనేది ఒక బృహత్తర పథకం అని తెలుగుదేశం వాళ్లు చెబుతుండవచ్చునేమో కానీ.. అది అమలు అవుతున్న తీరును, రైతులకు దాని వల్ల కలుగుతున్న లబ్ధిని గమనిస్తే మాత్రం అసలు విషయం అర్థం అవుతుంది. పగ్గాటు చెప్పట్టినప్పటి నుంచి రుణమాఫీ చేసేశాం చేసేశాం.. అని చెప్పుకొంటున్న తెలుగుదేశం వాళ్లు దాన్ని ఐదేళ్ల సీరియల్ గా కొనసాగించనున్నారు. ఎన్నో షరతులు.. మరెన్నో కారణాలు చెబుతూ.. చాలా మంది రైతులను రుణమాఫీకి అనర్హులుగా చేశారు.

ఇంతేనా.. రైతలను దొంగలు అన్నాడు తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. లక్ష రూపాయలుగా పైగా రుణాన్ని తీసుకొన్న వారిని వైకాపా దొంగలు అని అనడం చంద్రబాబుకే చెల్లింది. మరి అనామక వ్యాపారవేత్తలు వందల, వేల కోట్ల రూపాయలను అప్పులుగా తీసుకొని డీఫాల్టర్లుగా మారుతున్న ఈ వ్యవస్థలో.. రైతులు తమ భూములను తనఖా పెట్టి లక్ష రూపాయలు తీసుకొంటే దొంగలయిపోతారా?! ఇదేనా ఏపీ ముఖ్యమంత్రికి ఉన్న విజ్ఞత?!

అంతే కాదు.. ఇప్పుడు బాబు బ్యాంకర్లపై మండి పడుతున్నారట. రైతులకు ఇన్నిన్ని లోన్లు ఎలా ఇచ్చారు? అని ఆయన విరుచుకుపడ్డారు బ్యాంకర్ల సమావేశంలో. దీనిపై ఆర్బీఐకి ఫిర్యాదు చేస్తానని కూడా ఆయన బ్యాంకర్లను హడలు కొట్టినట్టు సమాచారం.

మరి ఏడాది కాలం నుంచి ఏపీ రైతులకు పంటల బీమా లేదు.. ఇన్ పుట్ సబ్సీడీలు లేవు.. పంటనష్టపరిహారాలే లేవు! రుణమాఫీకి రొటికీ, గిన్నెకూ చాలడం లేదు. మరి ఇలంటి నేపథ్యంలో కూడా ఏపీ ముఖ్యమంత్రి రైతులను అవమానిస్తూ మాట్లాడవచ్చునా! రైతులకు ఎందుకు రుణాలు ఇచ్చారని బ్యాంకర్లను బెదరగొట్టవచ్చునా?! ఇది ఏమైనా సబబేనా?!

మరింత సమాచారం తెలుసుకోండి: