వరల్డ్ కప్ లో రాణిస్తున్న టీమిండియాకు ప్రముఖుల నుంచి పొగడ్తలు దక్కుతున్నాయి. ఇప్పటి వరకూ విజయం సాధించింది లీగ్ మ్యాచ్ లలో మాత్రమే అయినా... బలిష్టమైన ప్రత్యర్థుల మీద గెలవడంతో అన్ని వర్గాల నుంచి టీమిండియాకు ప్రశంసలు దక్కుతున్నాయి. స్వయంగా భారత రాష్ట్రపతి ప్రధానమంత్రులుకూడా టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఇక అభిమానుల అనందాలకు అయితే అడ్డే లేదు. ఇలాంటి నేపథ్యంలో టీమిండియాకు ఒక చక్కటి ప్రశంస దక్కింది. ఇది కేవలం గెలవడం గురించి కాదు.. క్రమశిక్షణ గురించి! నిబద్దత గురించి. లోక్ సభ స్పీకర్ సుమత్రి మహాజన్ టీమిండియాకు ఈ విధంగా కితాబునిచ్చారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశం లో అమె మాట్లాడుతూ.. సభ్యులంతా క్రమశిక్షణతో నడుచుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆమె ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఎంపీలు అంతా టీమిండియాను చూసి నేర్చుకోవాలని ఆమె హితబోధ చేశారు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో టీమిండి సభ్యులంతా చాలా బాధ్యతాయుతంగా, చక్కని సమన్వయంతో ఆడి విజయం సాధించారని మహాజన్ అన్నారు.

ఇలాంటి క్రమశిక్షణ విషయంలో.. సమన్వయంతో సాగడం విషయంలో లోక్ సభ ఎంపీలు అంతా టీమిండియాను ఆదర్శంగా తీసుకోవాలని స్పీకర్ అభిప్రాయపడ్డారు. మరి కేవలం విజయం విషయంలోనూ గాక.. క్రమశిక్షణ విషయంలో టీమిండియా ఎంపీలకు ఆదర్శమని స్పీకర్ వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి టీమిండియాకు ఇదొక చక్కని ప్రశంస అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: