సెంట్రల్ బడ్జెట్ లో కొత్త రైళ్లకు కోత.. చార్జీల వాత ఉండే చాన్సుందని తెలుస్తోంది. మొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ కు రెడీ అయిన మోడీ సర్కార్.. రైల్వే బడ్జెట్ లో ఏం ఇస్తుంది? ఏం చేస్తుందన్నదానిపై… జనాల్లో ఆసక్తి కనిపిస్తోంది. అయితే… 26న సురేష్ ప్రభు ప్రవేశపెట్టనున్న చిట్టా పద్దుల్లో ఎన్ని కొత్త రైళ్లు ఇస్తారన్న విషయంపై కొత్త వాదన మొదలైంది. లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో 160 రైళ్లు మంజూరు చేసిన కేంద్రం ఈ సారి ఆ సంఖ్యను వందకే పరిమితం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

రైల్వేల్లో భారం తగ్గించుకోవాలని అనుకుంటున్న మోడీ సర్కార్. ఒకేసారి పెద్ద సంఖ్యలో కొత్త రైళ్లను అనౌన్స్ చేయడంపై ఇంట్రెస్ట్ చూపించడం లేదని టాక్. ఈ రీజన్ తోనే ఒకేసారి కాకుండా స్టెప్ బై స్టెప్ రైళ్లను ఇచ్చే వీలు ఉంటుందని రైల్వే వర్గాలు అంటున్నాయి. ఆదాయం పెంపుపై కన్నేసిన ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల పేరుతో కొత్త రైళ్లు తీసుకొచ్చే చాన్స్ ఉందని సమాచారం. రైళ్లపై ఆ కంపెనీల యాడ్స్ ఉండేలా డిజైన్ చేస్తారని తెలుస్తోంది.

ట్రాఫిక్ ఎక్కువగా ఉండే స్టేషన్లను పబ్లిక్ ప్రైవేట్ సిస్టమ్ లో అభివృద్ధి చేయడం, ప్రయాణికులకు టికెట్లు ఇవ్వడంలో ఈజీ విధానాలు, అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రత్యేక వెబ్ పోర్టల్, రైళ్లలో సీసీటీవీలు, వైఫై సదుపాయాలపై బడ్జెట్ లో ప్రపోజల్స్ ఉండే అవకాశం ఉంది. కానీ, ప్రీమియం రైళ్ల టికెట్లతోపాటు అప్పర్ క్లాస్ ఫేర్స్ కూడా పెంచే చాన్స్ కనిపిస్తోంది. రైల్వే స్టేషన్లలో స్వచ్ఛ్ భారత్ ఇంప్లిమెంటేషన్ పైనా కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు.

హైస్పీడ్ రైళ్లు తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నా ఈసారికి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపించటంలేదు. వీటి మెయింటెనెన్స్ పై స్టడీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచింది. ఈ ప్రక్రియ పూర్తయితే తప్ప హై స్పీడ్ రైళ్లపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఇంకోవైపు, స్టేషన్లలో విద్యుత్ సమస్య పరిష్కారానికి సోలార్, ఎల్ఈడీ బల్బుల వాడకంపైనా ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది. టోటల్ గా.. ప్రయాణికులకు మిక్స్ డ్ ఫీలింగ్స్ కలిగించేలా బడ్జెట్ ప్రపోజల్స్ ఉంటాయని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: