పేరున్న పత్రికలు... అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు తమ పత్రిక ప్రమోషన్ కూడా అందులో ఇమిడి ఉంటుంది. అనేక పేరున్న ఆంగ్లపత్రికలు తరచూ కొన్ని క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తుంటాయి. ఎంపిక చేసిన రంగాల్లో ప్రముఖులకు అవార్డులు ఇవ్వడం కూడా అందులో ఓ రకం. ఇండియా టుడే ఇచ్చే అవార్డులను ముఖ్యమంత్రులు కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు.

తెలుగులోకి వచ్చేసరికి టాప్ టూ ప్లేసెస్ లో ఉన్న ఈనాడు, సాక్షి రెండూ ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. గతంలో అమేజింగ్ అమ్మ, పరిపూర్ణమహిళ వంటి కాంటెస్ట్ నిర్వహించింది. సాక్షి కూడా స్పెల్ బీ వంటి పోటీలు నిర్వహించింది. ఐతే లేటెస్టుగా సాక్షి.. మీడియా ఎక్సలెన్సీ అవార్డులు ప్రకటించాలని నిర్ణయించింది.

ఐతే.. సాక్షి మీడియా అవార్డుల కార్యక్రమంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి అన్నా జగన్ అన్నా ఒంటికాలిపై లేచే టీడీపీ నేత వర్లరామయ్య సాక్షి అవార్డులను తప్పుబట్టారు. అవినీతి సొమ్ముతో పుట్టిన సాక్షిపత్రికకు మీడియా ఎక్సలెన్సీఅవార్డులు ఇచ్చే అర్హత లేదని విమర్శించారు. సాక్షికి చెందిన కొన్ని ఆస్తులను ఈడీ జప్తు చేసిందని.. ఈడీ నిఘా ఉన్న సాక్షి ఇలాంటి అవార్డులు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు.

ఈ అవార్డుల కార్యక్రమంలో వైఎస్ ఫోటోను వాడటాన్ని కూడా వర్ల తీవ్రంగా తప్పుబట్టారు. ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు వంటి మహానుభావుల బొమ్మల పక్కన అవినీతిపరుడైన వై.ఎస్. ఫోటోను ఎలా ఉంచుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సాక్షి టీమ్ గానీ... వైసీపీగానీ ఎలా స్పందిస్తాయో.. !

మరింత సమాచారం తెలుసుకోండి: