సభ్య సమాజంలో మహిళలను గౌరవించాలని ఎన్ని సార్లు ఎన్ని రకాలుగా చెప్పినా కొంత మంది మూర్ఖులు దానికి ఖాతరు చేయరు. అల్లరి చేయడానికి అమ్మాయిలను, మహిళలను వేధించడానికి పుట్టినట్టుగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వారికోసం ప్రభుత్వం ఎన్ని రకాల సెక్షన్లు పెట్టినా ఎన్ని రకాల చట్టాలు తీసుకు వచ్చినా వారి వంకర బుద్ది మాత్రం పోదు.

సహజంగా మనం బస్సులో చూస్తుంటాం ‘స్త్రీలకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం’ అని గౌరవంగా రాసి ఉంటుంది. మరి అలాంటిది బస్సు కండెక్టరు అందునా మహిళ ఆమెను వేధిస్తున ఆకతాయికి ఎలా బుద్ది చెప్పిందో చూద్దాం. నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన రాంబాబు అనే యువకుడు డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. మనోడికి ఎం వంకర బుద్ది పుట్టిందో కాని ఆమెను కొంత కాలంగా ఫాలో అవుతున్నాడు.

తను ఏ రూట్ వేయించుకుంటే ఆ రూట్ బస్సు ఎక్కి ఆమె పట్ల వెకిలి చేస్టలు చేస్తు వస్తున్నాడు. ఇది గమనించి సదరు మహిళా కండెక్టర్ ఆ ఆకతాయికి ఎలాగైనా బుద్ది చెప్పాలనుకుంది. నల్లగొండ బస్టాండు వద్ద సదరు టీజర్ ని పట్టుకొని చెప్పు తీసుకొని పడేల్ పడేల్ మని బాదింది. అంతేనా తప్పించుకుందామిన అటు ఇటు పోయినా వెంటపడీమరి కొట్టింది.

దీంతో పోలీసులు జోక్యం చేసుకొని మనోడ్ని అరెస్టు చేశారు. అందండి సంగతి మరి మహిళలు నోరు ముసుక్కుర్చుంటే కుదరదు కాలికి చెప్పులున్నాయని వాటికి కోపం వస్తుందని నిరూపించుకోండి ఆకతాయిల భరతం పట్టండి!

మరింత సమాచారం తెలుసుకోండి: