రాజధాని ప్రాంతంలోని గ్రామాలలో రైతులను ఆకట్టుకునేందుకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ కొత్త వ్యూహం లోకి వెళ్లింది. రాజధాని వల్ల అక్కడి రైతులు బాగు పడాలి కాని, కార్పొరేట్ సంస్థలు,ప్రైవేటు కంపెనీలు కాదంటూ వాదనను ముందుకు తీసుకు వచ్చింది.

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పక్షాన సుమారు పాతిక మంది ఎమ్మెల్యేలు ఆ ప్రాంతంలో పర్యటించి , అనంతరం రాజదాని సంస్థ సి.ఇ.ఓ శ్రీకాంత్ కు వినతిపత్రం ఇచ్చారు. రైతుల భూమి తీసుకొని ప్రైవేటు కంపెనీలకు ఇచ్చి వ్యాపారం చేయడాన్ని తాము అంగీకరించలేమని పేర్కొంది.

దీనిపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ తుళ్లూరులో రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని,కాని రాజధాని ఏర్పాటు వల్ల వచ్చే ప్రయోజనాలు రైతులకు దక్కాలని తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

రాజధాని కోర్ ప్రాంతంలో 2 వేల ఎకరాలు తీసుకుని మిగిలిన భూములను రైతులకే వదిలేయాలని కోరారు. ప్లాన్ ప్రకారం పారిశ్రామిక, వ్యాపార జోన్లను విభజించాలని, అవి అభివృద్ధి చెందితే ఆ భూములను రైతులే అమ్ముకుని లాభం పొందుతారని దర్మాన చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: