సరిహద్దు రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుపై మెల్లగా కదలిక వస్తోంది. బీజేపీతో పీడీపీ నేతలు ఇంటర్నల్ గా డిస్కషన్స్ కంటిన్యూ చేస్తున్నారు. 2 పార్టీల ప్రతిపాదనలపై ఒకరికొరు అంగీకారానికి వచ్చేందుకు ట్రై చేస్తున్నారు.

పాక్ శరణార్థులకు సహాయంతో పాటు కీలకమైన ఆర్టికల్ 370 పై దాదాపుగా ఓ అండర్ స్టాండింగ్ కు వచ్చాయి. ఢిల్లీకి వచ్చిన PDP చీఫ్ మహబూబ్ ముఫ్తీ కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుపైనే కాన్సన్ ట్రేట్ చేశారు.

బీజేపీతో పీడీపీ చర్చల్లో పురోగతి కనిపిస్తోందని ముఫ్తీ చెప్పారు. అన్ని విషయాలపై 2 పార్టీలు రెండుమూడు రోజుల్లో ఫైనల్ నిర్ణయానికి రావొచ్చన్నారు. ఆ తర్వాత కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుపై ఓ నిర్ణయం వచ్చే అవకాశం ఉందని ముఫ్తీ చెప్పారు.

పీడీపీ, బీజేపీ దోస్తీపై కాంగ్రెస్ సీరియస్ అయ్యింది. ఈ రెండు పార్టీలది డ్రామా అని కాశ్మీర్ కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ కామెంట్ చేశారు. ఆర్టికల్ 370 పై రెండు పార్టీలు మోసం చేస్తున్నాయని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: