ఎవడు కొడితే బంతి సిక్స్ లు, ఫోర్ లు పోతాయో వాడే గేల్ అంటాడు. ఈ డైలాగ్ అతనికి బాగా సూట్ అవుతుందేమో మరి జింబ్వాంబే తో జరిగిన మ్యాచ్ లో ఉగ్రరూపుడై పరుగుల సునామీ సృష్టించాడు. అంతే కాదు ఇప్పుడ జరుగుతున్న ప్రపంచ కప్ లో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా, వెస్టిండీస్ జట్టు తరపున వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ చేసిన బ్యాట్స్ మన్ గా గేల్ రికార్డు సృష్టించాడు.

జింబాబ్వే తో మ్యాచ్ లో గేల్ 138 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారతీయేతరుడు క్రిస్ గేల్. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో గేల్ 138 బంతుల్లో 16 సిక్స్‌లు, 9 ఫోర్లతో ద్విశతకం బాదాడు. డబుల్ సెంచరీ చేసిన తొలి భారతీయేతరుడిగా గేల్ చరిత్ర సృష్టించాడు.

అంతేకాకుండా, ప్రపంచకప్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడు గేల్. ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల రికార్డ్ ఇప్పటి వరకు కిర్‌స్టన్ పేరిట ఉంది. అతను 188 పరుగులు చేశాడు. ఈ రికార్డును గేల్ అధికమించారు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన గేల్ సెంచరీ చేశాక.. ఒక్కసారిగా రెచ్చిపోయాడు.

ఫోర్లు, సిక్సర్లతో పెను విధ్వంసం సృష్టించాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన నాలుగో ఆటగాడిగా గేల్ ఘనత సాధించాడు. ఇంతకుముందు భారత ఆటగాళ్లు సెహ్వాగ్, సచిన్, రోహిత్ శర్మ డబుల్ సెంచరీలు బాదారు. ఈ ముగ్గురు భారత ఆటగాళ్లే కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: