రతిక్రీడ అనేటప్పటికి పురుషులకే కాస్త ఇంట్రెస్ట్ ఎక్కువ కానీ వారు ఎంత వేగంగా స్పందిస్తారో అంతే వేగంగా ముగించేది. చాలామంది పురుషులు ఎక్కువసేపు రతి ఎలా చేయాలనేది ప్రశ్నిస్తూంటారు. కానీ ఈ విధమైన చర్యలు తీసకుంటే సంసారం సుఖంగా సాగే అవకాశాలు ఉన్నాయి అవి ఏమిటంటారా క్రింది అంశాలు చదవండి మరి ! పురుషుడు చేయాల్సిందల్లా మీ స్కలనం పై దృష్టి పెట్టకండి. ఆమె స్కలనం చేసే దశకు ఎపుడు వస్తుందా అనేది గమనించాలి. ఆమెను ఉద్రేకపరచేటందుకు కామోద్రేక స్ధానాలను కదిలించండి. శరీరాన్ని గట్టిగా అదమండి. ఈ చర్యలు కొంత సమయాన్ని తీసుకుంటాయి మీరు ఎక్కువ సమయం రతిక్రీడ ఆచరించేలా చేస్తాయి.

మీరే స్కలనం చేసే స్ధాయికి చేరుకుంటున్నారా? కొంత నియంత్రించండి. వేగంగా గట్టిగా చేయటం పురుషుడి నియంత్రణకు కష్టమవుతుంది. ఏదో ఒక రకంగా రతి చేసి ముగించేయాలని ఆలోచించవద్దు. ఆ క్షణాన్ని బాగా ఆనందించండి....రతికార్యంలోని మాధుర్యాన్ని ఆస్వాదించండి. బెడ్ లో అధిక సమయం కేటాయించగలమా లేదా అని ముందునుండే ఆలోచన చేయకండి. ఆత్మ విశ్వాసాని్న కలిగి అందుకవసరమైన మెళకువలను పాటించడంలో నిమగ్నమవండి.

అధిక సమయం స్కలనం కాకుండా నిలపటానికిగాను బిగపట్టే వ్యాయామాలు చేయండి. మూత్ర విసర్జన సమయంలో దానిని బిగపడుతూ కండరాలను ధృఢపరచండి. స్కలనం చెందాలంటే మహిళలు కొంత సమయాన్ని తీసుకుంటారు. పురుషులతో పోలిస్తే మహిళలు మూడ్ లోకి రావటానికిగాను కొంత సరస సల్లాపాలు కావాలి. అందుకు గాను మీరు కొంత సమయం, శ్రమ వెచ్చించాలి.

ఒక మహిళను ఉద్రేక పరచాలంటే... సాధారణంగా పురుషుడు ఉపయోగించే మొట్టమొదటి టెక్నిక్ ముందస్తు చర్యలు లేదా ఫోర్ ప్లే ఒక మంచి సాధనంగా చెప్పాలి. బెడ్ లో అధిక సమయం గడపాలంటే నిరోధించటం తప్పదు మరి. స్కలనం అయిపోతోందనుకుంటే, చర్యను ఆపవద్దు...కాని నెమ్మదిగా ప్రొసీడవండి. ఈ రకంగా బెడ్ లో ఎక్కువ సమయాన్ని ఆమెతో గడపవచ్చు. వేగంగా రతినాచరించవద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: