నాస్‌కామ్ – జెఎన్‌టియు తో టాస్క్ ఎంఒయు కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర ఐటి మంత్రి కెటిఆర్‌తో పాటు నాస్‌కామ్ చైర్మన్ బివియార్ మోహన్ రెడ్డి, శైలజా రామయ్యర్ హాజరయ్యారు. నాస్కామ్‌తో కలిసి చేస్తున్న ఈ పైలట్ ప్రాజెక్టుతో సుమారు 15 వేల మంది జెఎన్‌టియు విద్యార్థులు ఉద్యోగాలు పొందనున్నట్లు మంత్రి తెలిపారు.

దీనిలో భాగంగా విద్యార్థులందరికి డాటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, డిజైన్ ఇంజనీరింగ్ విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పుడున్న సిలబస్‌తో పాటు వివిద అకాడమిక్ మార్పులను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

తెలంగాణలో విద్యాప్రమాణాలు పెంచేందుకు తాము కొన్ని కఠిన చర్యలు తీసుకున్నామని, ఖచ్చితంగా విద్యార్థులు ఉద్యోగులుగా మారే విద్యావిధానాన్ని తయారు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నాణ్యతలేని విద్యాసంస్థల మీద చర్యలు తీసుకుంటే చాలామంది విమర్శించారని, అయినా తాము వెనక్కి తగ్గలేదని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో ఇంజనీర్ కావడం చాలా సులభమని… కాని రాసి కన్నా వాసి ముఖ్యమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉన్నత విద్య చదివిన విద్యార్థులను ఉద్యోగులుగా మార్చేందుకే టాస్క్ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. టాస్క్ ద్వారా శిక్షణ సౌకర్యాలు మెరుగు పర్చి, పరిశ్రమకి కావాల్సిన విద్యావిధానంలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: