అప్పలంగా వచ్చే సొమ్ముతో ఎవరైనా సుఖ సౌఖ్యాలు బోగభాగ్యాలు అనుభవిస్తుంటారు. అందునా దొంగ సొమ్మయితే మరీనూ..! అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్లు ఎర్రచందనం స్మగ్లింగ్ తో బీభత్సంగా డబ్బు గడించాడు. పోలీసు రైడింగ్ ల పట్టుపడినా కూడా వారి నుంచి చాకచక్యంగా తప్పించుకొని పోయిన ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. అతనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో 27 కేసులున్నాయి. మారిషస్, దుబాయ్ మధ్య అతను విజిటింగ్ వీసాలపై తిరిగినట్లు సిఐడి అధికారులు గుర్తించారు.

మనీలాండరింగ్ ద్వారా అతను డబ్బులు సమకూర్చునట్లు భావిస్తున్నారు. అంతర్జాతీయ స్మగ్లర ద్వారా డబ్బులు సమకూర్చుకున్నట్లు అనుమానిస్తున్నారు. రెండు దేశాల్లోనూ అతను స్మగ్లర్ల ఇళ్లలో ఆశ్రయం పొందినట్లు భావిస్తున్నారు. అతన్ని ఎపికి తీసుకుని వెళ్లేందుకు సిఐడి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లర్‌ గంగిరెడ్డిని ఇంటర్‌పోల్‌ అధికారులు మంగళవారం మారిషస్‌ కోర్టులో హాజరు పరిచారు. మార్చి 2వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది. కాగా, గంగిరెడ్డి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అది ఈ నెల 26వ తేదీన విచారణకు రానుంది.

ఏపీ నుంచి ఎర్రచందనం అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేసి కోట్లు గడించిన గంగిరెడ్డి 2014 మే 17 సినీఫక్కీలో దేశం విడిచి పారిపోయాడు. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్స్‌ జాబితాలో అతడు మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో ఏపీ డీజీపీ జేవీ రాముడు, సీఐడీ చీఫ్‌ ద్వారకా తిరుమలరావు అతడి అరెస్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.

అయితే వాంటెడ్‌ పర్సన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు అందజేయాలని కోరడంతో పదిరోజుల క్రితం సీఐడీ అధికారులను ఢిల్లీకి పంపి గంగిరెడ్డికి సంబంధించిన పూర్తివివరాలను అక్కడి ఇంటర్‌పోల్‌ అధికారులకు అందజేశారు. దాంతో అతని అరెస్టు సాధ్యమైంది. ఏదైమైనా మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ దొరికాడు. భవిష్యత్ లో ఇలాంటి స్మగ్లర్లు మన సంపదలను కొల్లగొట్టకుంటా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: