ప్రత్యేక తెలంగాణా ఇస్తే రాయలసీమను కూడా ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని బెట్టు చేసిన బైరెడ్డి రాజశేకర్ రెడ్డి తెదేపాను వీడడమే కాక బాబు తన పాద యాత్రను మొదలుపెట్టిన సమయంలోనే తాను పాదయాత్ర ప్రారంభించాడు. అదరహో అంటూ స్టేట్మెంట్ లు ఇచ్చి రాయలసీమకు తానొక్కడే ప్రతినిధి అయినట్లు బైరెడ్డి చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. తన యాత్రకు లభించని ప్రజాస్పందన వల్లనో లేక జగన్ పార్టీ తలుపులు తనకు తెరుచుకోలేదనో ఇప్పుడు బైరెడ్డి మళ్లీ తెదేపా తలుపు తట్టాడు. ఈ విషయంలో బాబుకి రాయబారం కూడా పంపినట్లు వినికిడి. మొత్తానికి ఎంత త్వరగా ఉద్యమం లేపాడో అంతే త్వరగా సారు చల్లబడ్డాడు. ఇలా చూస్తే ప్రత్యేక వాదం కొందరికే కలిసివస్తున్నట్లు అనిపిస్తుంది. చూడాలి ఆఖరకు బైరెడ్డి పయనమెటో! 

మరింత సమాచారం తెలుసుకోండి: