నిత్యం మనం బయటికి వెళ్లినపుడు ఏదో ఒక రకంగా జంగ్ ఫుడ్స్ తింటూ ఉంటాం కారణం మన ఇంట్లో చేసే వంటకాల వల్ల బోరో కొట్టో లేదా వెరైటీగా ఉంటుంది అని దీనికి ప్రియార్టీ ఇస్తాం. ఈ విధంగా ఎప్పుడో ఒకసారి అయితే పరవాలేదు. కొంత మంది ఈ జంగ్ ఫుడ్స్ పిచ్చి పిచ్చిగా ఇష్టపడతారు కారణం వాళ్ల ఆ టేస్టు భలే నచ్చుతుందని

జంగ్ ఫుడ్స్ ఎంత ప్రమాదమో దాని వలన ప్రమాదాలు ఏంత తీవ్ర రూపంలో ఉంటాయో తెలుసుకుంటే ఒళ్లు జలదరిస్తుంది. జంక్‌ఫుడ్‌తో జ్ఞాపకశక్తిని కోల్పోయే ప్రమాదముందని పరిశోధకులు అంటున్నారు. పిజ్జా, బర్గర్‌లు తింటున్నారంటే చాలు మెమరీ లాస్ తప్పదు.

వెయ్యిమంది ఆరోగ్యకరంగా ఉన్న పురుషులకు అధిక కొవ్వు ఉన్న కేక్‌లు, పేస్ట్రీలు, చిప్స్, ఫాస్ట్‌ఫుడ్ తిన్న తర్వాత వారిలో జ్ఞాపకశక్తి తగ్గిందని కాలిఫోర్నియాలోని శాన్‌డియాగో యూనివర్శిటీ నిర్వహించిన సర్వేలో తేలింది. అంతేగాకుండా జంక్ ఫుడ్ అధికంగా తీసుకునేవారిలో జ్ఞాపకశక్తి తగ్గడంతో పాటు అధిక ఒత్తిడికి కూడా గురవుతున్నారని పరిశోధనలో తేలింది.

జంక్‌ఫుడ్ తిన్నవారిలో ఒత్తిడి కారణంగా హృద్రోగాలు, కేన్సర్‌లకు కూడా దారితీస్తుంది. అందుకే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, పిజ్జాలు, ఫ్రైడ్ ఐటమ్స్, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి ఆహార పదార్థాలు తినడాన్ని తగ్గించడం ద్వారా హృద్రోగ సమస్యలు దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: