సరికొత్త పొలిటికల్ ఫైట్ కు హైదరాబాద్ రెడీ అయింది. మన సర్కార్ తో పాటు ఏపీ ప్రభుత్వం కూడా బడ్జెట్ సమావేశాలకు రెడీ అవుతోంది. ఇప్పటికే వచ్చే నెల 7 నుంచి పద్దుల సమావేశాలకు కేసీఆర్ సర్కార్ డిసైడైంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. మార్చి 7నే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సెషన్స్ నిర్వహించాలని నిర్ణయించింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఇప్పటి వరకు 2 రాష్ట్రాలు చెరో 2 సార్లు వేర్వేరుగా భేటీ అయ్యాయి. ఓ రాష్ట్ర సమావేశాలు అయిపోయాక మరో రాష్ట్రం సెషన్స్ కండక్ట్ చేసింది. ఇప్పుడు మాత్రం తెలంగాణ, ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఒకేసారి మొదలు కానుండడంతో ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కూడా 2 స్పీచ్ లు ఇవ్వాల్సి వస్తోంది.

పొద్దున 9 గంటలకు ఏపీలో 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీలో ప్రసంగం ఇచ్చేందుకు గవర్నర్ డిసైడయ్యారు. 2 రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలకు అంతా రెడీ అవడంతో పొలిటికల్ వర్గాల్లో జోష్ కనిపిస్తోంది.

దాదాపు ఏడెనిమిది నెలల తర్వాత మొత్తం 295 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలకు రానుండడంతో ఆ సందడి ముందే మొదలైంది. మొత్తం రెండు రాష్ట్రాలు.. రెండు ప్రభుత్వాలు.. రెండు విపక్షాలు. ఈ ఫైట్ ఎలా జరుగుతుందో అన్న ఆసక్తి పొలిటికల్ సర్కిల్స్ తో పాటు.. మామూలు జనాల్లోనూ కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: