రవాణా వ్యవస్ధలోనే తక్కువ చార్జీలు వసూలు చేస్తూ గమ్య స్ధలాలకు చేరుస్తోందన్న పేరు ఒక్క రైలుకు మాత్రమే ఉంది. కానీ పోయిన ఏడాది పెరిగిన చార్జీలతో సామాన్యుడిపై పెనుభారం పడింది. దీంతో అందరి దృష్టి రైల్వే బడ్జెట్ పైనే పడింది.

ట్రెయిన్ టిక్కెట్ రేట్స్ పెంచితే తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్యాసింజర్స్. సెంట్రల్ గవర్నమెంట్ మళ్లీ చార్జీలు హైక్ చేస్తే ట్రెయిన్ జర్నీకి దూరం అవ్వాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఒకవేళ పెంచాల్సి వస్తే ఫస్ట్ క్లాస్ , సెకెండ్ క్లాస్ టికెట్ల రేట్లు పెంచాలంటున్నారు.

ప్రస్తుతం ప్యాసింజర్స్ ట్రెయిన్స్ నష్టాల్లో నడుస్తున్నాయి. కేవలం గూడ్స్ ట్రాన్స్ పోర్ట్ ద్వారానే రైల్వే డిపార్ట్ మెంట్ కు ఆదాయం వస్తోంది. అయితే గూడ్స్ ట్రెయిన్స్ ప్రాఫిట్ తో ప్యాసింజర్ ట్రెయిన్స్ నడిపించడం కష్టమంటున్నారు ఆఫీసర్స్.

కానీ ప్రస్తుతం చార్జెస్ పెరుగుతాయా..? లేదా అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. చార్జీలు పెంచే ఆలోచన ఉంటే వెంటనే విరమించుకోవాలంటున్నారు కామన్ పీపుల్. అయితే తొలి బడ్జెట్ కావడంతో చార్జీల పెంపుఉండే అవకాశం లేదంటున్నారు ఎక్స్ పర్ట్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: