లెక్కలు కట్టేటప్పుడు శాస్త్రీయత చాలా అవసరం. అదేమీ లేకుండా అప్పుడెప్పడో జమానా లెక్కల ఆధారంగా సాయం చేస్తామనటంలో ఏమాత్రం అర్థం ఉండదు. తాజాగా కేంద్ర ఆర్థిక సంఘం సిపార్సుల్ని చూస్తే ఇదే ధోరణికి కనిపిస్తుంది.

ఆర్థిక సంఘం తాజాగా రాష్ట్రాలకు ఇచ్చే కేంద్రం పన్ను వసూళ్ల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించారు. పైకి చూసేందుకు పెద్ద మనసుతో కేంద్రం వ్యవహరించినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే.. కేంద్రం అందించే ఆదాయం 1971 జనాభా లెక్కల ఆధారంగా లెక్క కట్టారు. ఈ లెక్కన తెలంగాణకు అన్యాయం జరిగింది.

1971 నాటి తెలంగాణ జనాభాకు.. 2011 నాటి తెలంగాణ జనాభాకు మధ్య పోలికే లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో నష్టం వాటిల్లనుంది. కేంద్రం పన్నుల్లో తెలంగాణ వాటా కింద 2.43 శాతం నిధులు వస్తున్నాయి. కానీ.. 2011 జనాభా ప్రాతిపదికన తీసుకుంటే కేంద్ర పన్నుల్లో 2.83 శాతం నిధులు వచ్చేవి.

డబ్బులు ఇచ్చేది 2015 నుంచి 2020 అవసరాలకైతే .. జనాభా ప్రాతిపదికకు మాత్రం 1971 నాటి లెక్కలు తీసుకోవటం ఏమిటి? తాజాగా కేంద్ర ఆర్థిక సంఘం అనుసరించిన విధానం కారణంగా మొత్తంగా 0.48 శాతం నిధులను తెలంగాణ రాష్ట్రం నష్టపోనుంది. వేలాది కోట్ల రూపాయిల్లో 0.48శాతం అంటే భారీగానే నిధులను కోల్పోయినట్లేనని చెప్పక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: