సామాన్యుడు వినియోగించే పెట్రోలు, డిజెల్‌ కంటే విమానాలకు వినియోగించే ఇంధనం (ఎటీఎఫ్‌) చౌక అని చమురుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ బుధవారం నాడు చెప్పారు. పెట్రోల్‌, డీజెల్‌పై అధిక ఎక్సైజ్‌ డ్యూటీ విధిం చడమే కారణమని ఆయన వివరించారు.

ఎటీఎప్‌ కిలో లీటరు ఢిల్లిసలో రూ.46,513.03 పైసలు అంటే కిలోలీటరు రూ. 46.51 .. పెట్రోల్‌ విషయానికి వస్తే ఢిల్లిసలో రూ.57.31, డిజెల్‌ రూ.46.62 చొప్పున విక్రయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం ఇటీవల కాలంలో పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని నాలుగు సార్లు పెంచింది నవంబర్‌ నుంచి రూ.7.98 వరకు పెంచింది.

దీంతో పెట్రోల్‌పై గతంలోఎన్నడూ లేని విధంగా ఎక్సైజ్‌ సొంకం రూ.16.95కు చేరింది. డీజెల్‌పై లీటరుకు రూ.9.96 వసూలు చేస్తున్నారు. మరోపక్క విమానాలకు వినియోగంచే ఇంధనంపై సుంకం 8 శాతం మాత్రమేనని ప్రధాన్‌ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాశానం ఇచ్చారు.

ప్రభుత్వం పెట్రోల్‌, డీజెల్‌, ఎటీఎఫ్‌ ఇంధనాలపై నియంత్రణ ఎత్తివేసింది. అంతర్జాతీయ మార్కెట్‌ ధరలకు అనుసంధానం చేసింది. పెట్రోల్‌, డిజెల్‌పై నియంత్రణ ఎత్తివేయడంతో ఈ రెండు ఇంధనాలు గణనీయంగా తగ్గాయని ప్రధాన్‌ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: