రాజకీయనాయకులకు, మీడియాకు అవినాభావ సంబంధం ఉంది.. ఇవి రెండు ఒకరు లేకుండా మరొకరు బతకలేరు.. ఎన్నిరకాల వార్తలున్నా.. రాజకీయ నాయకుల వార్తల కంటే క్రేజ్ ఇంపార్టెన్స్ వేరు. అలాగే నాయకులు ఎంత పనిచేసినా.. మీడియాలో సరైన కవరేజ్ రాకపోతే..జనం దాన్ని గుర్తించరు. అందుకే నేతలు తమ వార్తలు మీడియాలో వస్తున్నాయో లేదో తెలుసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసుకుంటారు.

గతంలో నేతలు ప్రజలకు ఓ విషయం చెప్పాలనుకుంటే ప్రెస్ మీట్లు పెట్టాల్సివచ్చేది.. దానికి సమయం, ఖర్చు రెండూ ఉంటాయి. ఇంత చేసినా.. నాయకులు అరగంట మాట్లాడితే.. అందులో ఒకటో రెండో పాయింట్లు మీడియాలో వస్తాయి. తాము చెప్పాల్సింది సూటిగా జనంలోకిపోదు. ఇప్పుడు లేటెస్టుగా అందివస్తున్న టెక్నాలజీ ఈ సమస్యను తీరుస్తోంది.

ఇప్పుడు ప్రతినాయకుడికి ట్విట్టర్ ఎకౌంట్ కామనైపోయింది. ఏపీలో ఈ ట్రెండ్ స్టార్ చేసింది టీడీపీ యువనేత నారా లోకేశ్, ఆ తర్వాత బాబు కూడా కొడుకును ఫాలో అయ్యాడనుకోండి. ఆ తర్వాత పవన్ కల్యాణ్ కూడా పిట్టకూతలకు అలవాటుపడిపోయాడు. ప్రధాన ప్రతిపక్షనేత జగన్ మాత్రం కాస్త ఆలస్యంగా బుధవారం ట్విట్టర్ లోకం లోకి అడుగుపెట్టాడు.

మొదటి ట్వీట్ లోనే చంద్రబాబుపై విమర్శలు గుప్పించేశారు. ఆయన రైతు వ్యతిరేక విధానాలపై ధ్వజమెత్తారు. రైతు హత్యలకు ఎవరు కారణం..? మోసం చేసిన చంద్రబాబా... పట్టించుకోని ప్రభుత్వమా? గట్టిగా నిలదీయని సమాజమా.. అని జగన్ ట్విట్టర్లో ప్రశ్నించారు. జగన్ ట్విట్టర్ కు ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. అకౌంట్ తెరచి రోజు కూడా గడవకుండానే ఆరున్నరవేల మంది ఆయన్ను ఫాలో అవుతున్నారు. మొత్తానికి జగన్ కూడా టెక్నాలజీని బాగానే వాడుతున్నారన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: