మరో సారి ఢిల్లీ వెళ్లాలని అనుకొన్నాడట ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. షెడ్యూల్ ప్రకారం చూస్తే బాబు ఈ గురువారం రోజున ఢిల్లీకి వెళ్లాలి. చిత్తూరు జిల్లా పర్యటన ముగించుకొని ఆయన ఢిల్లీకి ప్రత్యేక విమానం ఎక్కాలి. అయితే ఈ పర్యటన చివరి నిమిషంలో రద్దు అయ్యింది. దీంతో ఏపీ ప్రభుత్వ ఖజానాకు కొంత మొత్తం సేవ్ అయ్యింది.

బాబు ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా ప్రత్యేక విమానంలోనే వెళతాడని ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. మందీ మార్బలంతో బాబు ప్రత్యేక విమానాన్ని ఏసుకొని ఢిల్లీ వెళతాడు. ప్రతి రోజూ హైదరాబాద్ నుంచి చాలా విమానాలు ఢిల్లీకి వెళుతున్నా.. చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానంలోనే వెళతాడంతే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాకా చాలా సార్లు బాబు ఈ తరహా పర్యటన చేపట్టాడు.

దీంతో ఏపీ ప్రభుత్వానికి ఖర్చు తడిసి మోపెడవుతోంది. వెనుకటికి కాంగ్రెస్ హయాంనాటి ముఖ్యమంత్రుల కన్నా ఎక్కువసార్లు బాబు ఢిల్లీ పర్యటన చేపట్టిన దాఖలాలు కనిపిస్తున్నాయి. అదేంటి..అంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్యాకేజీలను సాధించుకురావడానికి... నిధులను రాబట్టడానికి అంటారు. అయితే ఇప్పటి వరకూ సాధించింది మాత్రం ఏమీ లేదు.

ఈ నేపథ్యంలో బాబు గురువారం మరోసారి ఢిల్లీ వెళ్లాల్సిందట. అయితే.. ఇప్పుడు ప్రధానమంత్రి అపాయింట్ మెంట్ దక్కే అవకాశాలు లేనట్టుగా ఏపీ ప్రభుత్వానికి అర్థం అయ్యిందట. దీంతో బాబు ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకొన్నట్టుగా తెలుస్తోంది. మరి తీరా అక్కడికి వెళ్లాకా ప్రధానిని మీట్ కాలేకపోతే నవ్వులపాలు అవుతామని గ్రహించి.. ఈ పర్యటనను రద్దు చేశారు. తద్వారా ఏపీ ఖజానాకు ఈ ప్రత్యేక ప్రయాణ ఖర్చును కొంత సేవ్ చేశారు. కచ్చితంగా అభినందించాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: