వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకా సాగునీటి ప్రాజెక్టుల అంశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాడు. అంతకు ముందు బాబు హయాంలో సాగునీటి ప్రాజెక్టుల మచ్చటే లేదు.. ఆ శాఖకు డబ్బు కేటాయింపు ఉండేవి కావు.. అయితే వైఎస్ సీఎం అయ్యాకా మాత్రం ఈ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. అనేక ప్రాజెక్టులు పట్టాలు ఎక్కాయి.. అయితే అవి పూర్తి స్థాయిలో నిర్మాణం కాకముందే వైఎస్ చనిపోవడం జరిగింది.

ఆ తర్వాత సాగునీటి శాఖకు ప్రాధాన్యత దక్కలేదు. సరైన రీతిలో కేటాయింపులు లభించలేదు. దీంతో ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే నిలిచిపోయాయి. కేవలం కొన్ని కోట్ల రూపాయలు కేటాయిస్తే చాలు పూర్తయ్యే దశకు వచ్చిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అయితే ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోకుండానే కాలం గడిపేస్తున్నాయి.

ఆ సంగతలా ఉంటే... వైఎస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం జరిగిన కేటాయింపులపై తెలుగుదేశం తీవ్రంగా విమర్శలు చేసింది. జలయజ్ఞం కార్యక్రమాన్ని ధనయజ్ఞంగా అభివర్ణిస్తూ విరుచుకుపడింది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం అధికారం లో ఉంది. అయితే ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలుగుదేశంపై కూడా ఇప్పుడు బలమైన విమర్శలే వినిపిస్తున్నాయి.

ప్రత్యేకించి పట్టిసీమ ప్రాజెక్టు గురించి విమర్శలు వస్తున్నాయి. 1,300 కోట్ల రూపాయలతో చేపట్టాలని భావిస్తున్న ఈ ప్రాజెక్టు వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని..కేవలం కాంట్రాక్టర్ల కోసమే దీన్ని చేపడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో బీజేపీ కూడా అసంతృప్తితో ఉందట. మరి వైఎస్ హయాంలో ఏ అంశం గురించి అయితే టీడీపీ విమర్శలు చేసిందో.. ఇప్పుడు ఆ పార్టీ పై కూడా అలాంటి విమర్వలూ.. ఆరోపణలూ రావడం విశేషమే కదా!

మరింత సమాచారం తెలుసుకోండి: