అనంతపురం జిల్లాలో రైతు భరోసాయాత్రను నిర్వహిస్తున్నజగన్ మోహన్ రెడ్డికి బాగానే ఆదరణ లభిస్తున్నట్టుగానే ఉంది. వానలు లేక.. కరువు దెబ్బకు అల్లాడుతున్న జనాలకు ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ఇక రైతు రుణమాఫీ.. డ్వాక్రారుణమాఫీ అంశాలను ఏపీ ప్రభుత్వం అంత సవ్యంగా అమలు చేయడం లేదు.

ఈ నేపథ్యంలో ప్రజల్లో ఇప్పటికే అసంతృప్తి రగులుకొంటోంది. బాబు అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణమాఫీ అని చెప్పాడు.. దీంతో చాలా మంది డ్వాక్రా సంఘ సభ్యులు బ్యాంకులకు లోన్లు కట్టడమే మానేశారు. ఎన్నికల ముందు ఐదారు నెలల నుంచే వారు కట్టడం మానేశారు. ఇప్పటికీ వారుచెల్లింపు చేయడం లేదు. దీంతో మొత్తం డ్వాక్రా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది.

అయితే ఈ డ్వాక్రా రుణమాఫీ అంశం ఎంతకూ తెగకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి రగులుకొంటోంది. ఇక పేరుకు రుణమాఫీ చేవామని చంద్రబాబు చెప్పుకొంటున్నాడు కానీ.. ఈ అంశం పై కూడా రైతుల్లో అసంతృప్తే.. పూర్తి స్థాయిలో మాఫీ చేయకపోవడం.. పంటల బీమా, ఇన్ పుట్ సబ్సీడీ వంటివేమీ లేకపోవడంతో రైతుల్లోకూడా బాబుపై అసంతృప్తి నెలకొంది.

ఈ నేపథ్యంలో జగన్ జనాల మధ్య కు వెళ్లేసరికి బాగానే ఆదరణ లభిస్తోంది. అయితే .. వెనుకటికి కూడా జగన్ కు ఇదే స్థాయిలో జనాలు వచ్చారు.. ఎన్నికల ప్రచార సభల్లోనూ.. అంతకన్నా ముందు జనాల్లోకి వెళ్లినప్పుడుకూడా ఇలాంటి ఆదరణే కనిపించింది. అయితే అందుకు తగ్గ ఫలితాలు ఎన్నికల సమయంలో కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు భారీ స్థాయిలో జనాలు వస్తున్నా.. వైకాపా వాళ్లకు ఏం అర్థం కాని పరిస్థితే నెలకొంది!

మరింత సమాచారం తెలుసుకోండి: