ఈ కాలంలో ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నప్పటికి మనం తీసుకొనే ఆహార పదార్ధాల వల్ల చాలా మంది కొలెస్టాల్ ను తగ్గించుకోలేక పోతున్నారు. మరి మనిషి జీవించాలంటే ఏదో ఒక ఆహార పదార్థాలు తీసుకోవాల్సిందే కాదా మరి అందులో కొలెస్టాల్ కి సంబంధించిన ఉండావా ? అంటే ఉంటాయి కాని మనం కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే కొంత వరకు నిర్మూలించవచ్చు.

అంతే కాకుండా వ్యాయామాలు, యోగాలు చేసి కొంత వరకు నయం చేసుకోవచ్చు కానీ పూర్తి స్థాయిలో కాదు దీనికి పరిష్కారం మార్గం మనం తీసుకోనే ఆహార పదార్ధాలపైనే ఉంటుంది. మరి ఎలాంటి ఆహారం తీసుకొని దీన్ని దూరం చేసుకోవచ్చూ అంటే ఈ క్రిందివాటిని ఫాలో కండి..!

పుట్టగొడుగులు: కొలెస్టరాల్ నిల్వలు తగ్గించడంలో పుట్టగొడుగుల్లోని బి, సి, క్యాల్షియం విటమిన్లతోపాటు ఇతర మినరల్స్ బాగా పనిచేస్తాయి. ఓట్ మీల్: దీనిలోని బీటాగ్లూకస్ అనే ప్రత్యేక పీచుపదార్థం స్పాంజివలే పనిచేసి కొలెస్టరాల్ ను గ్రహిస్తుంది. ద్రాక్ష: ద్రాక్షలోని ముఖ్యమైన అంతోసైనిన్స్, టానిన్స్ వంటివి కొలెస్టరాల్ నిల్వల్ని బాగా తగ్గిస్తాయి. ద్రాక్షలోని పొటాసియం, శరీరంలోని విష పదార్థాలను నిర్వీర్యం చేస్తుంది. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ద్రాక్ష నిషిద్ధం.

క్యారెట్: కొలెస్టరాల్ నిల్వలను తగ్గించడంలో క్యారెట్లోని బీటాకెరొటీన్ తోడ్పడుతుంది. ప్రతిరోజూ క్యారెట్ తింటుంటే శరీరంలోని కొలెస్టరాల్ నిల్వలు పదిశాతం తగ్గుతాయి. మిరియాలు: నల్లమిరియాలు శరీరంలోని కొలెస్టరాల్ నిల్వలు బాగా తగ్గిస్తాయి. గుండెను వ్యాధులబారి పడకుండా రక్షిస్తాయి. వీటిలోని కాప్సిసిన్ పెయిన్ కిల్లర్‌గా ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: